- Telugu News Photo Gallery Tamarind Side Effects: Consuming too much Tamarind is Dangerous to Health know more details
Tamarind Side Effects: చింతపండు సైడ్ ఎఫెక్ట్స్: చింతపండు పుల్లగా మరియు తీపిగా ఉంటుంది, కాబట్టి తినే ముందు జాగ్రత్త!
చింతపండు పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతుంటుంది. పుల్లగా, తియ్యగా ఉండే చింతపండును ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక పచ్చి చింతకాయను కాస్త ఉప్పులో కలిపి తింటే ఆ టేస్టే వేరప్పా. స్వర్గంలో కూడా ఇంతటి రుచి దొరకదని అంటారు. అయితే, దీనిని అతిగా తినడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 18, 2023 | 3:37 PM

Tamarind

రుచిలో చింతపండు తియ్యగా, పుల్లగా టేస్టీగా ఉంటుంది. అయితే, ఇది అతిగా తినడం ఆరోగ్యానికి హానీ తలపెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

సాధారణంగా మన దేశంలో ప్రతి ఇంటి వంట గదిలో చింతపండు తప్పక ఉంటుంది. ఎందుకంటే.. దీనిని వంటల్లో వినియోగిస్తారు. సాంబారు, రసం, చట్నీలు, రైస్ బాత్ మొదలైన రకరకాల వంటలలో ఉపయోగిస్తారు.

అయితే, చింతపండు తియ్యగా, పుల్లగా ఉండటం వల్ల దంతాల సమస్యకు కారణం అవుతుంది. చింతపండు తినడం వల్ల పంటి నొప్పి మరింత పెరుగుతుంది.

ముఖ్యంగా స్త్రీలు తమ బహిష్టు సమయంలో చింతపండును అస్సలు తినొద్దని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. బహిష్టు సమయంలో చింతపండును గానీ, చింతపండుతో చేసిన రసాలను గానీ తిన్నా, తాగినా.. కడుపునొప్పి తీవ్రంగా మారుతుంది.

ఇక ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో చింతపండు తినడం వల్ల కడుపు నొప్పి సమస్యకు దారితీస్తుంది. అజీర్తి, అసిడిటి సమస్యను పెంచుతుంది. అందుకే, చింతపండును పరిమితంగా తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.





























