- Telugu News Photo Gallery Summer Tips: Simple tips to keep the water tank cool during the summer season
Water Tank: ఇంటిపై వాటర్ ట్యాంక్‌లోని నీళ్లు ఎండకు వేడెక్కుతున్నాయా? ఇలా చేస్తే చలచల్లగా మారిపోతాయ్..
వేసవిలో చల్లని నీటితో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది. పగలంతా ఎండ వేడి కారణంగా అందులోని నీరు వేడిగా మారడం ప్రారంభిస్తుంది. దీంతో ఈ కాలంలో ట్యాంక్‌లోని నీరు స్నానం చేయాలంటే అసౌకర్యంగా ఉంటుంది..
Updated on: Mar 25, 2025 | 1:49 PM

వేసవి వచ్చేసింది. సీజన్ ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చల్లని పానియాలు సేవిచండం, చల్లని నీటితో స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది. పగలంతా ఎండ వేడి కారణంగా అందులోని నీరు వేడిగా మారడం ప్రారంభిస్తుంది

దీంతో ఈ కాలంలో ట్యాంక్‌లోని నీరు సహజంగా చల్లగా ఎలా ఉంచాలో తెలియక అవస్థలు పడుతుంటారు. కానీ ఈ కింది సింపుల్ చిట్కాలు ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా చల్లబరచడానికి ఉపయోగపడతాయి. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

వేసవిలో నీటి ట్యాంక్‌ను ప్రత్యక్ష సూర్యకాంతికి గురిచేయకుండా ఉండాలి. వీలైతే, నీటి ట్యాంక్‌ను నీడలో ఉంచడానికి ప్రయత్నించండి. వేసవిలో వాటర్ ట్యాంక్, దాని పైపులు వేడెక్కకుండా పైపును ఎండ నుంచి రక్షించడానికి కవర్ చేయడం ఉత్తమం.

ఎండ బలంగా ఉంటే, ట్యాంక్ పైన టిన్ షెడ్ నిర్మించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ట్యాంక్‌ను తెల్లటి వస్త్రంతో కప్పవచ్చు. లేదంటే అల్యూమినియం ఫాయిల్‌తో కూడా కప్పవచ్చు. ఇది సూర్యరశ్మి ట్యాంక్ మీద పడకుండా నిరోధించి నీటిని చల్లబరుస్తుంది. ట్యాంక్ నీరు వేడెక్కుతుంటే, ట్యాంక్ మీద తడి జనపనార సంచి లేదా మందపాటి గుడ్డలు వేయడం వల్ల ట్యాంక్ వేడెక్కకుండా నీటిని చల్లగా ఉంచుతుంది.

వాటర్ ట్యాంక్ నలుపు లేదా ముదురు రంగులో ఉంటే దానికి లేత రంగు పెయింట్ చేసుకోవాలి. లేత రంగులు సూర్యరశ్మిని తక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి నీరు వేడెక్కదు. లేదంటే ఇంట్లో ట్యాంక్ బహిరంగ ప్రదేశంలో ఉంటే ట్యాంక్ చుట్టూ గడ్డి లేదా తేమతో కూడిన మట్టిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల వేడి తగ్గి నీరు చల్లబడుతుంది.





























