వేసవిలో రెడ్ మీట్ ముట్టుకోకూడదు. బదులుగా చేపలు తినడం మంచిది. చేపలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. చేప పులుసు కూడా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. లస్సీ, మజ్జిగ వంటి పానియాలు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రోబయోటిక్స్, ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉండే ఈ పానీయాలు శరీరానికి పోషణనిచ్చి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే పెరుగులోనూ కాల్షియం, ప్రొటీన్లు, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు, పేగుల ఆరోగ్యాన్ని పెరుగు కాపాడుతుంది.