- Telugu News Photo Gallery Stretch Marks on stomach and thighs can be reduced with these tips, Check Here is Details
Stretch Marks: పొట్ట, తొడలపై ఏర్పడే చారలను ఈ చిట్కాలతో తగ్గించుకోవచ్చు..
ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగానే స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. చాలా మంది లేడీస్ ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. ఈ స్ట్రెచ్ మార్క్స్‌ని తొలగించుకునేందుకు చాలా కష్ట పడుతూ ఉంటారు. కానీ ఈ చిట్కాలతో ఈజీగా పోగొట్టవచ్చు. అవేంటో చూసేయండి..
Updated on: Jan 17, 2025 | 6:17 PM

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. చాలా మంది మహిళలకు పొట్టపై చారలు అనేవి వస్తూ ఉంటాయి. డెలివరీ తర్వాత కూడా ఈ గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ కారణంగా మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఈ మార్క్స్ పోగొట్టుకోవడం కోసం అనేక క్రీములు వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో లేడీస్ పొట్ట అనేది ముందుకు సాగుతుంది. దీని కారణంగా ఆడవాళ్ల పొట్టపై గీతలు అనేవి పడతాయి.

పొట్ట భాగంలో స్కిన్ వెనకాల ఫైబర్ కాస్త విరిగి పోవడం వల్ల కూడా ఇలాంటి గీతలు అనేవి కనిపిస్తాయి. ఈ గీతలు డెలివరీ అయిన కొన్ని రోజులకు మాయం అవుతాయి. కానీ కొంత మందికి మాత్రం అలానే ఉండిపోతాయి.

ఇలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే సరి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది ఎక్కువగా ఫుడ్ తిని ఓవర్ వెయిట్ అవుతారు. ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. వీటిని తగ్గించి.. నిమ్మరసం తాగుతూ ఉండాలి. దీని వల్ల వికారం తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు.

జోజో ఆయిల్‌ని పొట్టపై ప్రతి రోజూ రాస్తే ఈ గీతలు సులువుగా పోతాయి. కలబంద రసంలో ఆలివ్ ఆయిల్, కోకో బటర్ కూడా కలిపి స్ట్రెచ్ మార్క్స్‌పై రాస్తే.. ఈ గీతలు కంట్రోల్ అవుతాయి. బాదం ఆయిల్, విటమిన్ ఈ ఉండే క్రీమ్స్ రాసినా స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




