Sreeleela: అమ్మడి హవా నెక్స్ట్ లెవల్..! టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ హీరోయిన్ గా శ్రీలీల..
అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు.. శత్రువులు ఎక్కడో ఉండరట. మన చెళ్లెళ్ల రూపంలో.. కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారట. అయితే ఇదే డైలాగ్‌ను.. కాస్త అటీటుగా మార్చి.. రష్మిక అండ్ పూజా బేబీకి సింక్ చేస్తున్నారుకొంత మంది నెటిజెన్లు. సింక్ చేయడమే కాదు.. ఈ బ్యూటీలకు శత్రవు ఎక్కడో లేరని.. ఈ బ్యూటీల స్టేట్‌లోనే.. వీరికి తీసిపోని అందంతోనే.. ఉన్నారని వారంటున్నారు. పూజా, రష్మికలకు ఇప్పుడు శత్రువు శ్రీలీలనే అంటున్నారు.