- Telugu News Photo Gallery Sports photos Anantapur Young Woman Niharika Creates a Record by Cycling 600 Kilometers in the Misty Himalayas
Cycling In Leh Ladakh: హిమశిఖరాలపై సైక్లింగ్.. సరికొత్త రికార్డు సృష్టించిన అనంతపురం అమ్మాయి
Ladakh Cycling: లేహ్ లద్దాక్ లో తెలుగమ్మాయి సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మంచు కొండల్లో సైకిల్ యాత్ర చేసి తెలుగువారి పేరును రికార్డుల్లోకి ఎక్కించింది. 17 ఏళ్ళ నిహారిక 6వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది. అనంతపురం జిల్లాకు నిహారిక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ సహసం చేసింది. చిన్నప్పటి నుంచి సైక్లింగ్ పై ఉన్న ఆసక్తితో నిహారిక ముంబై నుంచి హైదరాబాద్ కు 7వందల కిలోమీటర్లు సైకిల్ పై వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచింది...
Updated on: Aug 27, 2023 | 8:25 PM

లేహ్ లద్దాక్ లో తెలుగమ్మాయి సాహస యాత్ర చేపట్టింది.. మంచు కొండల్లో సైకిల్ యాత్ర చేసింది. 17 ఏళ్ళ నిహారిక 6వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది..

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన నిహారిక తల్లిదండ్రులు ముంబైలో వ్యాపారిత్యా స్థిరపడ్డారు.

చిన్నప్పటి నుంచి సైక్లింగ్ పై ఉన్న ఆసక్తితో నిహారిక ముంబై నుంచి హైదరాబాద్ కు 7వందల కిలోమీటర్లు సైకిల్ పై వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచింది... అలా చిన్నప్పటి నుంచే సైకిల్ రేస్ లపై రోజురోజుకు ఆసక్తి పెరిగింది.

తాజాగా లేహ్ నుంచి ద్రాస్ వరకు...ద్రాస్ నుంచి మళ్ళీ లేహ్ వరకు హిమాలయన్ అల్ట్రా రేస్ చేపట్టింది... ఎంచక్కా మంచు కొండల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించాల్సిన వయస్సులో కఠినమైన యాత్ర చేపట్టి సక్సెస్ అయ్యింది.

17 ఏళ్ళ నిహారిక ప్రతికూల పరిస్తితుల్లో.... సముద్ర మట్టానికి పది వేల మీటర్ల ఎత్తైన ప్రదేశంలో సైకిల్ యాత్ర చేపట్టింది.... శ్వాస తీసుకోవడం కూడా కష్టమైన వాతావరణంలో 34 గంటల్లో 6వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేసింది...అంతర్జాతీయ సైక్లింగ్ రేసుల్లో పాల్గొనేందుకు... ఆశయ సాధన కోసం వడివడిగా నిహారిక అడుగులు వేస్తుంది....
