- Telugu News Photo Gallery Split Ends Care: How To Take Care Split Ends of Hair Naturally, Check Out Here
Split ends of hair: జుట్టు చివర్లు చిట్లుతున్నాయని కత్తిరిస్తున్నారా? ఇది శాశ్వత పరిష్కారం కాదు..ఇలా చేసిచూడండి
అందమైన సిల్కీ స్మూత్ హెయిర్ కోసం మగువలు రకరకాల సౌందర్య ఉత్పత్తులు ఉపయోగిస్తుంటారు. కానీ ఫలితం మరోలా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది పలు రకాల జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. వాటిలో ఒకటి జుట్టు చివర్లు చిట్లిపోవడం. జుట్టు చిట్లి విడిపోతే.. చాలా మంది జుట్టును కత్తిరించుకుంటారు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 22, 2024 | 12:02 PM

ముఖ్యంగా తగినంత తేమ లేకపోవడం వల్ల జుట్టు చివర్లు చీలిపోతుంటాయి. జుట్టు, స్కాల్ప్ విపరీతంగా పొడిగా మారినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. దీని కోసం తలలో తేమను నిర్వహించడం చాలా అవసరం. చాలా మంది బ్లో డ్రైయర్లను ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసి, తేమను కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా వెంట్రుకల చివర్లు స్ప్లిట్ అవుతుంటాయి.

జుట్టుకు ఎక్కువ హెయిర్ కలర్ వేసినా ఈ సమస్య తలెత్తుతుంది. ఇది జుట్టును పాడు చేస్తుంది. రంగులో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి చివరలను చీల్చడానికి కారణం అవుతుంది. జుట్టును పదేపదే దువ్వడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. జుట్టును తరచుగా బ్రష్ చేయడం వల్ల రాపిడికి గురై చివర్లు చీలిపోతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అంతే కాకుండా జన్యుపరమైన కారణాల వల్ల కూడా జుట్టు చివర్లు చీలిపోతాయి. చాలా మందికి పుట్టుకతోనే పొడి జుట్టు ఉంటుంది. వీరికి జుట్టు సన్నగా మారి, వెంట్రుకలు చివర్ల చిట్లిపోతుంటాయి. ఇలాంటి వారికి ఎటువంటి కారణం లేకుండానే సమస్య తలెత్తుతుంది.

ఈ సమస్యను నివారించడానికి రసాయనాలు ఉన్న షాంపూలను ఉపయోగించకూడదు. షాంపూ చేసిన తర్వాత జుట్టును బాగా ఆరబెట్టాలి. వేడినీళ్లతో కాకుండా సహజంగానే చల్లని నీళ్లతో తలస్నానం చేయాలి.