AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganga Jal: గంగా జలం అమృతంతో సమానమే.. కాశీ నుంచి ఇంటికి తీసుకురావద్దని తెలుసా

స్కంద పురాణం ప్రకారం కాశీ మోక్ష నగరం. మణికర్ణిక ఘాట్‌లో జరిగే అంత్యక్రియల కారణంగా గంగా జలం పవిత్రమైనప్పటికీ.. చనిపోయినవారి అవశేషాలతో ఉన్న సంబంధం కారణంగా గంగా జలాన్ని ఇంటికి తీసుకురాకపోవడమే మంచిదని నమ్ముతారు. ఇలా చెప్పడానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే గంగానదిలో చితి నుంచి సేకరించిన బూడిద, అవశేషాలను కలుపుతారు. అందువల్ల ఆధ్యాత్మికంగా గంగా నదికి ఉన్న గౌరవం, శాస్త్రీయ కారణాల వల్ల గంగా జలాన్ని కాశీ నుంచి ఇంటికి తీసుకురావద్దని చెబుతారు.

Surya Kala
|

Updated on: Jul 17, 2025 | 1:32 PM

Share
హిందూ మతంలో గంగా జలాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు. పూజ, స్నానం, తర్పణం, ఆచారాలు, శుద్ధి సహా అనేక ఆచార కార్యక్రమాల్లో గంగా జలాన్ని ఉపయోగిస్తారు. గంగమ్మ ప్రవహించే హరిద్వార్, రిషికేశ్,  గంగోత్రి నుంచి గంగా జలాన్ని తీసుకుని వస్తారు. ఈ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే గంగా జలం శక్తి, ఆరోగ్యం, సానుకూలతకు చిహ్నం. ఇది పాపాలను కడిగివేసి ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు.

1 / 6
అయితే ప్రపంచంలో అత్యంత పురాతన నగరం.. పవిత్ర క్షేత్రం వారణాసి నుంచి మాత్రం గంగా జలాన్ని ఇంటికి తీసుకురావద్దని అంటారు. ఇలా చెప్పడం వెనుక మనకు తెలియని కారణం ఉంది. కాశి క్షేత్రం మనిషి చివరి మజిలీగా భావిస్తారు. ఇక్కడ ఆణువణువూ భావోద్వేగ భక్తి , ఆధ్యాత్మిక సున్నితత్వంతో ముడిపడి ఉంటుంది. కనుక కాశీ క్షేత్రం నుంచి గంగా జలాన్ని ఇంటికి ఎందుకు తీసుకురాకూడదో ఈ రోజు తెలుసుకుందాం

2 / 6
స్కంద పురాణం ప్రకారం కాశ్యం మరణాం ముక్తి ' అనే సామెత ఉంది . దీని అర్థం కాశీలో మరణం మోక్షానికి ద్వారం. అందుకనే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు. ఇది కేవలం సంప్రదాయానికి సంబంధించిన నమ్మకం మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక అవగాహన, విశ్వాసం. గంగా నది తీరంలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ లలో ప్రతిరోజూ మరణించిన వందలాది మంది చితాభస్మాన్ని, ఎముకలను నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వలన మరణించిన వారి ఆత్మలకు మోక్షం లభిస్తుందని నమ్మకం.

3 / 6
కాశీలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ రెండూ దహన సంస్కారాలకు ప్రసిద్ధి చెందినవి. అందుకనే ఈ ఘాట్లను హిందువులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడ దహన సంస్కారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

4 / 6
కాశీలో ప్రవహించే గంగానది నీటిలో ఆత్మ అవశేషాలు ఉంటాయి. కనుక ఈ నీటిని ఇంటికి తెచ్చుకుంటే.. అందులో ఆత్మల అవశేషాలు ఉంటాయని.. అప్పుడు తెలియకుండానే వారి మోక్షానికి అడ్డంకులు ఏర్పడతాయని నమ్ముతారు. ఇలా నీరు తెచ్చుకోవడం అపవిత్రమైన కార్యక్రమం కాదు.. కేవలం మరణించిన వ్యక్తుల ఆత్మల పట్ల గౌరవ భావన. అందుకే కాశీ నుంచి ఏమీ తీసుకురాకూడదని పురాణాలు పేర్కొన్నాయి.  అది బూడిద అయినా, నీరు లేదా జ్ఞాపకాలు కావచ్చు. అయితే కాశీ క్షేత్రం నుంచి శివుడి ఆశీర్వాదం, ఆధ్యాత్మిక శాంతి భావన మాత్రమే వెంట తెచ్చుకోవాలని చెబుతారు.

5 / 6
మణికర్ణికా ఘాట్ మాత్రమే కాదు నగర సమీపంలోని ఇతర ఘాట్ల నుంచి గంగా నీటిని ఇంటికి తీసుకెళ్లకూడదు. ఇక్కడ, మరణించిన వారి చితాభస్మం గంగా నదిలో కలిసి ఒక వైపు నుంచి మరొక వైపుకు నిరంతరం ప్రవహిస్తుంది. అందువల్ల కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి తీసుకురావద్దని అంటారు. అయితే హరిద్వార్‌లో గంగా జలంపై చాలా పరిశోధనలు జరిగాయి. ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని కూడా చెబుతారు.

6 / 6
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..