Samatha Kumbh 2024: గరుడ సేవల ప్రత్యేకత ఏంటో మీకు తెల్సా…

సమతాకుంభ్ 108 దివ్యదేశాల రెండో బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనాలకు ఓ ప్రత్యేక ఉంది. గజ, తురగ, శేషాది వాహనాలలో రోజుకొకటి అధిరోహించి భగవంతుడు దర్శనమిస్తాడు. దానిలో ఆంతర్యం జీవరాసులన్నిటికీ తానే ఆధారమని తెలియజేయడానికే అంటారు. ఈ వాహన సేవలన్నింటిలో గరుడ వాహనానికి ఒక ప్రత్యేకత ఉంది.

|

Updated on: Feb 23, 2024 | 5:32 PM

 పరమాత్మ ఏ వాహనాన్ని అధిరోహిస్తున్నా విష్ణు నిజవాహనమైన గరుత్మంతుణ్ణి అందులోకి ఆహ్వానిస్తారు. గరుడపై వేంచేసిన విష్ణువును దర్శిస్తే ఎంతో ఆనందాన్ని పొందుతారని మన ఆగమ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. 108 పెరుమాళ్ళని గరుడులపై ఒక్కసారే సేవించే శక్తి మన కనులకు లేదని, ఆరు రోజుల ఉత్సవంగా దీనిని విభాగం చేసారు. రోజుకి 18 మంది పెరుమాళ్ళ చొప్పున 6 రోజులలో 108 మంది పెరుమాళ్ళకి ఈ గరుడవాహన సేవలు జరిపిస్తారు.

1 / 5
  సామాన్యంగా మనిషి తలతో, గ్రద్ద ముక్కుతో 108 రెక్కలు కలిగి ఉన్న గరుడ వాహనాన్ని మనం అన్నిఆలయాలలో దర్శిస్తాము. కానీ  సమతా ప్రాంగణంలోని దివ్యదేశాధీశులకు ఎంతో ప్రత్యేకంగా పక్షిరాజు రూపంలో రెక్కలుచాచి ఉన్న గరుడవాహనాలను ఇంతకు ముందెక్కడా కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వంగా, అద్భుతంగా రూపకల్పన చేసారు.

2 / 5
మన పెరుమాళ్ళకి తగినట్టుగా 3 అడుగుల ఎత్తుతో 18 గరుడ వాహనాలను వేరువేరు ప్రాంతాలలో తయారు చేయించారు. అందులో చైనా నుంచి సమతామూర్తి నిర్మాణంలో ఉపయోగించిన పంచ లోహాలతో ఆరు. ఒరిస్సా రాష్ట్రం నుండి దారువుతో 6, తమిళనాట కుంభకోణం నుండి దారువుతోనే 4, చెన్నెనగరం నుండి ఇత్తడితో మిగిలిన 2 వాహనాలను తెప్పించారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు సత్సంతానం, వంశాభివృద్ధి వంటి ఇహలోక ఫలితాలతో పాటు మోక్షం కూడా లభిస్తుంది.

3 / 5
తన తల్లి వినతకి దాస్య విముక్తి కలిగించిన బలశాలి వైనతేయుడు. తల్లి దీవెనతో సాక్షాత్ విష్ణువుకే వాహనంగా సేవకుడయ్యాడు. అంతేకాదు, ఆ స్వామి పాదాలను ఆశ్రయించడమే మోక్ష సాధనమని మనందరికీ కూడా బోధిస్తూ, నిరంతరం ఆస్వామిని భుజాలపై వహిస్తూ, ఆ స్వామి పాదాలను రెండుచేతలా ధరిస్తూ దర్శన మిస్తుంటాడు.

4 / 5
 సాధారణంగా గరుడ వాహనారూఢుడైన ఒక్క స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యప్రదం అంటారు. మరి 18 గరుడవాహనాలపై 18 దివ్యదేశాల్లో ఉండే స్వామిని సేవించుకోగలగడం కేవలం మన ఆచార్యుల దివ్యసంకల్పం వల్లనే సాధ్యపడింది.

5 / 5
Follow us
Latest Articles
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు

ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!

బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!

కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు

పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..

తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు

నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్

గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..