- Telugu News Photo Gallery Spiritual photos Vinayaka Chavithi: In Bidar Preparation of Ganapati by painting natural colors, There is a huge demand for this young man
Vinayaka Chavithi: సహజ రంగులతో వినాయక విగ్రహాల తయారీ.. ఏపీ, తెలంగాణా, మహారాష్ట్రల్లో భారీ డిమాండ్
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ వినాయకచవితి పండుగ. తొలి పూజను అందుకునే గణనాధుడు పుట్టిన రోజుని వినాయక చవితిగా పిల్లలు, పెద్దలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. హిందువులు ఏ పని మొదలు పెట్టినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా జరగాలని మొదటి పూజను గణపయ్యకు చేస్తారు. అయితే డిల్లీ నుంచి గల్లీ వరకూ మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు. నవ రాత్రి ఉత్సవాలను జరుపుతారు. అయితే మండపాలలో ప్రతిష్టించే గణపతిని సహజ రంగులు వేసి తయారు చేయడం వలన పర్యావరణ పరిరక్షణ అవుతుంది.
Updated on: Aug 13, 2024 | 6:15 PM

ఓ యువకుడు తయారు చేసిన వినాయకుడి విగ్రహాలకు తెలంగాణ, మహారాష్ట్రల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వినియోగదారుల కోరిక మేరకు గణపతిని తయారు చేసి వారి ఇష్టానుసారంగా అందిస్తారు. కుగ్రామంలో తయారు చేసిన గణపతి విగ్రహాలకు ఇతర ర్రాష్ట్రాల్లో అమ్ముతూ వచ్చిన డబ్బుతో హాయిగా జీవనం సాగిస్తున్నాడు.

బీదర్ తాలూకాలోని చంబోలా గ్రామానికి చెందిన ఆకాష్ అనే యువకుడు గత 9 సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తున్నాడు. వందలకొద్దీ వినాయకులను తయారు చేసి విక్రయిస్తూ ఏడాదికి పది లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు. ఆయన తయారు చేసిన గణేశ విగ్రహానికి రాష్ట్రవ్యాప్తంగా గిరాకీ ఉండడంతో జనాలు బుక్ చేసుకుంటున్నారు.

6 అంగుళాల వినాయకుడి నుంచి 15 అడుగుల వరకు వివిధ రకాల వినాయక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వినాయకుడిని ఐదు వందల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. వీరి వినాయకుడి విగ్రహాలను ఎత్తు, డిజైన్ ల ఆధారంగా డబ్బులను వసూలు చేస్తారు.

ఈ యువకుడు తయారు చేసిన గణేశ విగ్రహాలను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో విక్రయిస్తున్నారు. తాము తయారు చేసే వినాయక విగ్రహాలు తక్కువ ధరలకే లభిస్తాయని, కస్టమర్ల డిమాండ్ కు అనుగుణంగా వినాయకుడి విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నామని చెప్పారు.

ఇక్కడ వీరు తయారు చేసే వివిధ రకాల గణపతి విగ్రహాలు ఆదరణ పొందుతున్నాయి. అంతే కాదు వినియోగదారుల కోరికలు తెలుసుకుని గణపతుల విగ్రహాలను రకరకాలుగా తయారు చేస్తూ విగ్రహాలకు కొత్త టచ్ ఇచ్చేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా వీరి గణేశ విగ్రహాలు అందరి మదిలో నిలిచిపోవడంతో వినియోగదారులు వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తున్నారు.

గణేశ చతుర్థికి రెండు నెలల ముందు నుంచే ఆకాష్ వినాయకుడి విగ్రహాల తయారు చేయడంలో మునిగిపోతాడు. మే నెల నుంచి గణపతి వినాయక విగ్రహాలను రెడీ చేయడం మొదలు పెడతాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా బిజీబిజీగా గణపతి విగ్రహాలు చేస్తాడు. వివిధ డిజైన్లతో ఇప్పటికే సిద్ధమైన గణయ్యకు ఆకర్షణీయమైన రంగులను అడ్డడంలో మునిగిపోయారు.

వినాయక చవితి ఉత్సవం దగ్గర పడుతుండటంతో గణపయ్య విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఏడాది 12 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని రెడీ చేసినట్లు 35 గణపతి విగ్రహాలను తయారు చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఇంట్లో ప్రతిష్టించడానికి సుమారు 4 వేల విగ్రహాలను తయారు చేసినట్లు చెప్పారు. తమ వద్ద 30 రకాల డిజైన్లతో కూడిన విగ్రహాలు అందుబాటులో ఉన్నాయని ఆకాష్ తెలిపారు.




