- Telugu News Photo Gallery If you see these in your dream, you will definitely get Raja Yoga, Check Here is Details
Dreams Meaning: మీ కలలో ఇవి కనిపిస్తే.. ఖచ్చితంగా రాజయోగం పడుతుందట..
సాధారణంగా రాత్రి పూట నిద్ర పోతున్న సమయంలో అనేక కలలు వస్తూ ఉంటాయి. ఈ కలల్లో అనేక రకాలు ఉంటాయి. కొన్ని భయ పెడితే.. మరి కొన్ని నవ్వు తెప్పిస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి. కలలో చాలా రకాల వస్తువుల, మనుషులు, ప్రదేశాలు ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఏది కనిపిస్తే మంచిదో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పేవి మీ కలలో కనిపిస్తే ఖచ్చితంగా మీకు రాజయోగం అనేది పడుతుందని జోత్యిష్య పండితులు..
Updated on: Aug 13, 2024 | 12:51 PM

సాధారణంగా రాత్రి పూట నిద్ర పోతున్న సమయంలో అనేక కలలు వస్తూ ఉంటాయి. ఈ కలల్లో అనేక రకాలు ఉంటాయి. కొన్ని భయ పెడితే.. మరి కొన్ని నవ్వు తెప్పిస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి. కలలో చాలా రకాల వస్తువుల, మనుషులు, ప్రదేశాలు ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఏది కనిపిస్తే మంచిదో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

కానీ ఇప్పుడు చెప్పేవి మీ కలలో కనిపిస్తే ఖచ్చితంగా మీకు రాజయోగం అనేది పడుతుందని జోత్యిష్య పండితులు చెబుతున్నారు. మీ కలలో తామర పువ్వు కనుక కనిపిస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎందుకంటే తామర పువ్వును లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు.

మీ కలలో గజ రాజు ఏనుగు కనిపిస్తే.. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఏనుగును మనం వినాయకుడిగా కొలుస్తాం. ఎక్కడ ఏనుగు కనిపించినా మొక్కుతాం. కాబట్టి మనం చేసే పనుల్లో ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు ఎదురైనా దూరం అవుతాయి. వినాయకుని కటాక్షం మీకు లభిస్తుంది.

అదే విధంగా మీ కలలో ఆవు కనిపించినా చాలా అదృష్టం. ఆవు ఒక దేవతా స్వరూపం. అన్ని రకాల దేవుళ్లు ఆవులో కొలువై ఉంటారు. కాబట్టి మీ కలలో కనుక ఆవును కనిపిస్తే.. మీ జీవితంలో సక్సెస్ అనేది పెరుగుతుంది. ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు.

అలాగే గుడ్ల గూబను చాలా మంది చెడుకు గుర్తుగా భావిస్తారు. గుడ్ల గూబలు కేవలం రాత్రి వేళలో మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. కానీ మీ కలలో గుడ్ల గూబ కనిపిస్తే చాలా మంచిదని డ్రీమ్స్ సైన్స్ చెబుతుంది. ఎందుకంటే గుడ్ల గూబను కూడా లక్ష్మీ స్వరూపంగా చెబుతారు.




