- Telugu News Photo Gallery Spiritual photos This tour package is best if you want to go to Maha Kumbh Mela
Maha Kumbh: మహా కుంభమేళాకి వెళ్లాలని ఉందా.? ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్..
ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మీరు కూడా మహా కుంభమేళాకు వెళ్ళాలి అనుకుంటే IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీలో మీ ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజీలో వారణాసి, గంగాసాగర్, మహా కుంభమేళా, పూరీ ప్రాంతాలను దర్శించుకోవచ్చు. ఇందులో సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్నందున ముందే బుక్చేసుకోవడం బెటర్. ఈ టూర్ ప్యాకేజీ ధర ఎంత.? సౌకర్యాలు ఏంటి.? ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Jan 29, 2025 | 5:43 PM

"వారణాసి, గంగాసాగర్ & పూరితో మహాకుంభ యాత్ర" పేరు IRCTC ఓ సరికొత్త టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి ఈ ప్యాకేజీ మొదలుకానుంది. ఈ కుంభమేళా టూర్ ప్యాకేజీని www.irctctourism.com/package అనే IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీ "భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు" ద్వారా 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగనుంది. ఈ ప్యాకేజీలో ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, షుజల్పూర్, సెహోర్, రాణి, కమలాపతి, ఇటార్సి, నర్సింగ్‌పూర్, జబల్పూర్, కట్ని, బోర్డింగ్ పాయింట్లు ఉన్నాయి. అలాగే డీ-బోర్డింగ్ పాయింట్లు విషయానికి కట్ని, జబల్పూర్, నర్సింగ్‌పూర్, ఇటార్సి, రాణి కమలపతి, సెహోర్, షుజల్‌పూర్, ఉజ్జయిని, దేవాస్, ఇండోర్ ఉన్నాయి.

ఈ టూర్ ప్యాకేజీలో వారణాసి, ప్రయాగ్‌రాజ్, గంగాసాగర్, కోల్‌కతా, పూరిలను మీరు కవర్ చెయ్యవచ్చు. ఈ రైలు ప్రయాణంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ప్రయాణీకులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. వీటితో పాటు ఆరోగ్య బీమా కూడా లభిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణీకుల భద్రత నిమిత్తం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రతి కోచ్‌కు భద్రతా సిబ్బంది ఉంటారు.

Maha Kumbh 2025

ఈ టూర్ ప్యాకేజీలో ఎకానమీ (SL)లో ప్రయాణించాలంటే ఒక్కొక్కరికి రూ. 24,500, స్టాండర్డ్ (3AC) బుక్ చేసుకువాలంటే ఒక్క వ్యక్తికి రూ. 34,400, అలాగే కంఫర్ట్ (2AC)లో మీ ప్రయాణం కొనసాగించాలంటే ఒక్కొక్కరికి రూ. 42,600గా ధరలను నిర్ణయించడం జరిగింది.




