- Telugu News Photo Gallery Spiritual photos These are the zodiac signs that need to be careful due to planetary retrogrades
గ్రహాల తిరోగమనం.. రాఖీరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల వారు వీరే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, తిరోగమనం, కలయిక అనేది సహజం. గ్రహాల కలయిక లేదా సంచారం, తిరోగమనం వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అంతే కాకుండా కొన్ని సార్లు వీటి వలన కొన్ని రాశులకు అదృష్టం కలిగితే మరికొన్ని రాశుల వారికి కష్టాలు , సమస్యలు ఎదురు అవుతుంటాయి. అయితే ఈ సారి రాఖీపండగ రోజే నాలుగు గ్రహాలు తిరోగమనం చేయనున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కోనున్నారంట.
Updated on: Aug 08, 2025 | 10:10 AM

ఈ సంవత్సరం, రక్షా బంధన్ ఆగస్టు 9 న జరుపుకుంటున్నారు . ఈ రోజున ఒక అరుదైన యాదృచ్చికం జరుగుతుంది, అది ఏమిటంటే? నాలుగు గ్రహాలు తిరోగమనంలో సంచరించడం వలన మూడు రాశుల వారికి సమస్యలు తప్పవంట. రాఖీ నాడు శని, బుధుడు, రాహువు ,కేతువు కలిసి తిరోగమనంలో ఉంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం , ఈ యాదృచ్చికం సంఘటన మూడు రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకరానుంది. ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం చాలా కష్టం. ఎవరైతే చాలా రోజుల నుంచి బుణ సదుపాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి బుణం లభించడం కష్టమే, ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయి. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తుల రాశి :తుల రాశి వారికి ఈ సమయంలో అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి. మీ ప్రమేయం లేకుండా మీరు చిక్కుల్లో పడతారు. కుటుంబంలో కలహాలు ఎక్కువ అవుతాయి. విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప మంచి ఫలితాలు అందుకోలేరు. ఈ రాశి వారు గ్రహాల తిరోగమనం సమయంలో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.

కర్కాటక రాశి : ఈ రాశుల వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల తిరోగమనం శుభప్రదంగా పరిగణించబడదు. అటువంటి పరిస్థితిలో మీరు ఏ పని చేసినా అందులో ఆటంకం ఎదురు అవ్వడం, వ్యాపారల్లో నష్టాలు రావడం జరుగుతుందంట.

అంతే కాకుండా ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా ఉండటమే శ్రేయస్కరం అంటున్నారు పండితులు. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పెట్టుబడుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి, వీలైనంత వరకు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. కొత్త ఉద్యోగం పొందడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది.



