- Telugu News Photo Gallery Spiritual photos These are the benefits of lighting a lamp near a Tulsi plant every day
ప్రతి సాయంత్రం తులసి చెట్టు వద్ద దీపం పెడితే అదృష్టం వరించినట్లే!
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత వేరు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి చెట్టును ప్రతి రోజూ పూజించి, సాయంత్రం వేళల్లో దీపం పెట్టడం వలన అదృష్టం కలిసి రావడమే కాకుండా, ఇంటిలో సంపద వృద్ధి చెందుతుందని చెబుతున్నారు నిపుణులు. దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Updated on: Dec 01, 2025 | 3:32 PM

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు. హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవతగా పూజిస్తారు. ప్రతి రోజూ దీపారాధన చేస్తుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో నిత్యం తులసి చెట్టుకు దీపారాధన చేస్తారు. అయితే ప్రత్యేక మాసాల్లోనే కాకుండా, నిత్యం దీపారాధన చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. కాగా తులసి చెట్టు వద్ద దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన ఇంటిలో సానుకూల శక్తి ప్రవహించడమే కాకుండా, ఇది ఇంటి పరిసరాలను కూడా శుద్ధి చేస్తుందంట. దీని వలన కుటుంబ సభ్యులందరి జీవితాల్లో నూతనోత్సాహం కలుగుతుంది. అన్ని విధాల కలిసి వస్తుంది.

లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని చెబుతుంటారు. అంతేకాకుండా తులసి విష్ణువుకు కూడా చాలా ప్రియమైనది అని అందరి నమ్మకం. అందువలన ప్రతి రోజూ సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన ఇద్దరి ఆశీర్వాదాలు ఇంటిపై ఉండటమే కాకుండా, అదృష్టం వరిస్తుందంట.

ప్రతి రోజూ సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, ఒత్తిడి కూడా తగ్గుతుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్క వద్ద ప్రతి రోజూ దీపం వెలిగించడం వలన ఇంటిలో సంపద , శ్రేయస్సు, అదృష్టం పెరుగుతాయి. అంతే కాకుండా అప్పుల సమస్యలతో సతమతం అయ్యే వారు వాటి నుంచి త్వరగా బయటపడతారని చెబుతున్నారు నిపుణులు.



