- Telugu News Photo Gallery Spiritual photos Temporary Relief from Shani Dosha: These zodiacs to have relief from money and personal problems
Lord Shani: శని దోషం నుంచి ఊరట.. వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..!
Lord Shani Dev: ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శని వల్ల ఆరు రాశులకు శని దోషం ఏర్పడింది. శని దోషం వల్ల వీరికి అనేక విధాలైన కష్టనష్టాలు కలుగుతాయి. అయితే, అక్టోబర్ మొదటి వారం వరకూ ఈ ఆరు రాశుల వారికి శని దోషం నుంచి తాత్కాలిక విరామం లభించింది. అందుకు ప్రధాన కారణం మీన రాశిలో ఉన్న శనీశ్వరుడిని కన్యా రాశిలో చోటు చేసుకున్న బుధాదిత్య యోగం పూర్ణ దృష్టితో వీక్షించడమే. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
Updated on: Sep 26, 2025 | 6:28 PM

మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని ప్రవేశం వల్ల ఏర్పడిన ఏలిన్నాటి శని దోషం బాగా తగ్గిపోయి, శుభ ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది. ప్రతి పనీ సకాలంలో పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించనంతగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయికి క్రమంగా పెరిగే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల అష్టమ శని దోషం కలిగింది. అయితే, రవి, బుధుల సమ సప్తక దృష్టి వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. కుటుంబ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ది చెందుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి రాజయోగం పడుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఊహించని అపర కుబేర యోగం పట్టడానికి అవకాశం ఉంది.

కన్య: సప్తమ స్థానంలో శని వల్ల ఈ రాశివారు పడుతున్న కష్టాలకు కొద్ది రోజుల పాటు తెరపడుతుంది. ఈ రాశివారికి శని దోషం చాలావరకు తొలగిపోయి, మనసులోని కోరికలు నెరవేరడం ప్రారంభం అవుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అయి, ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడం, ఆస్తిపాస్తులు సమకూరడం వంటివి జరుగుతాయి. శుభకార్యాలు జరుగుతాయి.

ధనుస్సు: ప్రస్తుతం అర్ధాష్టమ శనితో అవస్థలు పడుతున్న ఈ రాశివారికి కష్ట కాలం ముగిసి, సుఖపడే సమయం ప్రారంభం అయింది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో స్థిరపడతారు. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.

కుంభం: ప్రస్తుతం ఏలిన్నాటి శని కారణంగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ రాశివారికి బుధ, రవుల దృష్టి వల్ల చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా చేతికి అందుతుంది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు.

మీనం: ఏలిన్నాటి శని ప్రభావం ఉన్న ఈ రాశివారికి రవి, బుధుల దృష్టి వల్ల అనేక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నమైనా సునాయాసంగా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వారసత్వ సంపద కలిసి వచ్చే సూచనలున్నాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కుతారు.



