- Telugu News Photo Gallery Spiritual photos Telugu Astrology: Pisces Horoscope Increased Planetary Influence This Month
Astrology: వారికి ఊహించని కష్టనష్టాలు.. మార్చిలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులివే!
March Horoscope 2025: మీన రాశిలో మే నెలంతా గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండబోతోంది. ఏదైనా రాశిలో గ్రహాల భారం పెరగడం కొన్ని రాశులకు మంచిదే కానీ, మరికొన్ని రాశులకు కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ తప్పుతుంది. దీనివల్ల సమస్యలు, వివాదాలు, అనారోగ్యాలు, ఖర్చులు వంటివి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు ఊహించని కష్టనష్టాలకు గురి కావాల్సి వస్తుంది.
Updated on: Mar 05, 2025 | 11:46 AM

మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో శుక్ర, బుధ, రవి, రాహువులు కలవబోతున్నందువల్ల ఆదాయం కంటే వ్యయం బాగా పెరిగే అవకాశం ఉంది. విలాసాల మీద ఖర్చులు పెరగడంతో పాటు కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా కలుగుతాయి. వైద్య ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి. విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు చేతికి అందకపోవచ్చు. ప్రయత్న లోపాలు ఎక్కువగా ఉంటాయి.

సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడం వల్ల ఆదాయపరంగా సమస్యలు తలెత్తుతాయి. పనికి తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు. మిత్రుల కారణంగా డబ్బు నష్టం జరుగుతుంది. పెట్టుబడులకు తగ్గ లాభాలు అందక వ్యాపారాల్లో నిరాశాపూరిత వాతావరణం చోటు చేసుకుం టుంది. కొందరు బంధుమిత్రులు అపనిందలు వేయడం, దుష్ప్రచారాలు సాగించడం జరుగు తుంది. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమ ఎక్కువ ఫలితం బాగా తక్కువగా ఉంటుంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఏ పనీ సవ్యంగా సాగనందువల్ల ఇబ్బంది పడతారు. నమ్మించి ద్రోహం చేసే వారు ఎక్కువగా ఉంటారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొత్త ప్రయత్నాలేవీ చేపట్టకపోవడం మంచిది. ప్రేమ జీవితం అసంతృప్తి కలిగిస్తుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో, అంటే ఆలోచనా స్థానంలో, అత్యధిక గ్రహాలు చేరడం వల్ల ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో పొరపాట్లు దొర్లే అవ కాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా తప్పటడుగులు వేయడం జరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కోపతాపాల్ని అదుపు చేయడం మంచిది.

ధనుస్సు: ఈ రాశికి నాలుగవ స్థానంలో నాలుగు గ్రహాలు కేంద్రీకృతం కావడం వల్ల ప్రతి పనీ అర్ధంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు లభించకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన లాభాలు లభించే అవకాశం ఉండదు. కుటుంబంలో ఊహించని చికాకులు తలెత్తుతాయి. కొందరు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. బంధువుల వల్ల ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల వల్ల బాగా ధన నష్టం జరుగుతుంది.

మీనం: ఈ రాశిలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఎంత శ్రమపడ్డా గుర్తింపు లేకపోవడం, ఫలితం ఉండకపోవడం వంటివి జరుగుతాయి. సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగు తుంది. ధనపరంగా వాగ్దానాలు చేసినా, హామీలు ఉన్నా ఇబ్బందులకు గురవుతారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా మారుతాయి. మానసికంగా బాగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.



