AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vipreet Rajayoga: రవి, శనుల కటాక్షం.. ఆ రాశుల వారు సంపన్నులు కాబోతున్నారు..!

రవి, శనులు తండ్రీ కుమారులు. అయితే, ఈ రెండు గ్రహాలు కలిసినా, పరస్పరం చూసుకున్నా మంచిది కాదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. కొన్ని రాశులకు మాత్రం ఈ రెండు గ్రహాల యుతి, పరస్పర దృష్టి రాజయోగాలనివ్వడం జరుగుతుంది. ఈ నెల(సెప్టెంబర్) 16 నుంచి అక్టోబర్ 16 వరకు రవి కన్యారాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడితో ఈ రవికి సమ సప్తక దృష్టి ఏర్పడుతుంది. దీనివల్ల వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు విపరీత రాజయోగం పడుతుంది. రాజకీయాల్లో అధికార యోగం పడుతుంది. ప్రభుత్వంలో అందలాలు ఎక్కుతారు. ఈ రాశివారు తరచూ శివార్చన చేసినా, ఆదిత్య హృదయం పఠించినా మరింత మంచి ఫలితాలుంటాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 21, 2025 | 8:42 PM

Share
వృషభం: ఈ రాశికి రవి, శనుల పరస్పర దృష్టి వల్ల కాహళ యోగం అనే అరుదైన యోగం కలిగింది. దీని వల్ల తప్పకుండా అధికార యోగం, వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి, అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. రహస్య శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. రాజకీయాల్లో అందలాలు ఎక్కుతారు.

1 / 6
కర్కాటకం: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాల్లో సంచారం చేస్తున్న రవి, శనుల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా అత్యధిక లాభాలు పొందుతారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో హోదాపరంగా, జీతభత్యాల పరంగా అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది.

2 / 6
తుల: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ది చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం వృద్ది చెందుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది.

3 / 6
వృశ్చికం: ఈ రాశివారికి రవి, శనుల సమ సప్తక దృష్టి కారణంగా విదేశీ మూలక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి సంపద పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో భారీ జీతభత్యాలతో కూడిన స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగం పట్టడానికి కూడా అవకాశం ఉంది. ఉన్నతస్థాయి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.

4 / 6
మకరం: ఈ రాశివారికి శని, రవుల పరస్పర వీక్షణ వల్ల ఉద్యోగంలో విపరీత రాజయోగం పడుతుంది. తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను దాటుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పలుకుబడి కలిగిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది.

5 / 6
మీనం: ప్రస్తుతం ఏలిన్నాటి శని సమస్యలో ఉన్న ఈ రాశివారికి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులను చేపట్టడం జరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం సునాయాసంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

6 / 6