Lord Shani: రుజు మార్గంలోకి శనీశ్వరుడు.. ఇక ఈ రాశుల వారికి వరాల వర్షం!
ప్రస్తుతం మీన రాశిలో వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు ఈ నెల(నవంబర్) 28 నుంచి వక్ర త్యాగం చేసి, రుజు మార్గంలో సంచారం చేయబోతున్నాడు. వచ్చే ఏడాది జూన్ వరకూ ఎటువంటి దోషమూ లేకుండా సంచారం చేసే శనీశ్వరుడి వల్ల వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులవారు అత్యధికంగా లబ్ధి పొందబోతున్నారు. ముఖ్యమైన సమస్యల నుంచి విముక్తులు కావడం, ఆదాయం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, పెళ్లిళ్లు, గృహ, వాహనాల విషయంలో శీఘ్ర పురోగతి చెందడం వంటివి జరుగుతాయి. శనిని మరింతగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాశులవారు తరచూ శివార్చన చేయించడంతో పాటు, ఆలయాల్లో ఉండే శని విగ్రహానికి ప్రదక్షిణలు చేయడం మంచిది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5