- Telugu News Photo Gallery Spiritual photos According to Baba Vanga astrology, these are the zodiac signs that will become rich in the year 2026
Baba Vanga: బాబా వంగా జ్యోతిష్యం.. 2026లో పక్కా ధనవంతులయ్యేది వీరే!
బాబా వంగ జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలియజేయడం జరిగింది. అవి చాలా వరకు నిజం అయ్యాయి. దీంతో ఈయన జ్యోతిష్యం అంటే చాలా మంది నమ్మకం ఏర్పడింది. అయితే ఆయన 2026 సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో కూడా తెలియజేయడం జరిగింది.
Updated on: Nov 20, 2025 | 6:12 PM

బాబా వంగా అంచనాలు చాలా వరకు నిజం అయ్యాయి. ఆయన ఎన్నో విషయాలను ముందుగానే అంచనావేసి తెలియజేయడం జరిగింది. అదే విధంగా, బాబా వంగా 2026 సంవత్సరంలో నాలుగు రాశుల వారు తప్పకుండా ధనవంతులు అవుతారని తెలిపారు. కాగా, ఆ రాశులను ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

వృషభ రాశి : వృషభ రాశి వారికి 2026 వస్తూ వస్తూనే అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారు. అంతే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. ఇంటిలోపల పాటిజిటివిటి పెరుగుతుంది. మొత్తానికి ఈ రాశి వారు 2026 సంవత్సరం లక్కీ ఇయర్ అనే చెప్పాలి.

కుంభ రాశి : కుంభరాశి వారికి 2026 చాలా బెస్ట్ ఇయర్ అని చెప్పాలి. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. సంపద పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కన్యా రాశి : కన్యారాశి వారికి ఊహించని విధంగా అదృష్టం తలుపు తడుతుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. ఆనందకర జీవితాన్ని గడుపుతారు

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి 2026 చాలా బాగుంటుంది. గతంలోకంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మెరుగుపడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు సంపాదిస్తారు. కుటుంబ సమస్యలన్నీ తగ్గిపోయి, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.



