- Telugu News Photo Gallery Spiritual photos Jupiter's Rare Impact Brings Wealth and Rajayoga to 5 Signs Telugu Astrology
Jupiter Rare Impact: గురువు అదుపులో గ్రహాలు..ఆ రాశుల వారి పంట పండినట్టే!
Telugu Astrology: నవంబర్ నెలలో రెండు పర్యాయాలు రాహుకేతువుల మినహా ఇతర గ్రహాలన్నీ ఉచ్ఛ గురువు అదుపులోకి వస్తున్నాయి. అతి అరుదుగా జరిగే ఇటువంటి పరిణామం వల్ల కొన్ని రాశుల వారు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ నెల (నవంబర్) 21, 22, 23 తేదీల్లో ఒకసారి, 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మరోసారి ఏకంగా ఏడు గ్రహాల మీద గురువు దృష్టి పడుతోంది. వృశ్చిక రాశిలో ఉన్న రవి, బుధ, కుజ, చంద్రుల మీదా, మీన రాశిలో ఉన్న శని మీదా గురు దృష్టి పడడం వల్ల, తులా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు కూడా గురువుకు చెందిన విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తున్నందు వల్ల అవన్నీ శుభ ఫలితాలనిస్తాయి. దీని వల్ల వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులకు తప్పకుండా ధన యోగాలు, రాజ యోగాలు కలుగుతాయి.
Updated on: Nov 20, 2025 | 6:09 PM

వృషభం: ఈ రాశికి సప్తమ, లాభ స్థానాలు గురువు ప్రభావానికి లోనవుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఈ రాశివారు ఆదాయ వృద్ధిని కోరు కునే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల ఆ దిశలో చిన్న ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు కలిగి జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించడానికి ఇది అనువైన సమయం.

కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు పంచమ స్థానంలో ఉన్న రవి, బుధ, కుజ, చంద్ర గ్రహాల్ని, భాగ్య స్థానంలో ఉన్న శనీశ్వరుడిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజ పూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచే కాక, సామాజికంగా కూడా గుర్తింపు లభిస్తుంది. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ధన, షష్ట స్థానాల్లో ఉన్న గ్రహాలను వీక్షిం చడం వల్ల ఆదాయం వృద్ధి చెందడం, ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, పదోన్నతులు కలగడం, విదేశీ ఆఫర్లు అందడం, వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రావలసిన సొమ్ము వసూలవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం: ఈ రాశిలో యుతి చెందిన నాలుగు గ్రహాలను, పంచమ స్థానంలో ఉన్న శనీశ్వరుడిని ఉచ్ఛ గురువు పూర్ణ దృష్టితో వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు, రాజ యోగాలు కలుగుతాయి. గౌరవ మర్యాదలు వృద్ధి చెంది ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందు తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది.

మకరం: ఈ రాశికి తృతీయంలో ఉన్నరాశ్యధిపతి శనిని, లాభ స్థానంలో ఉన్న గ్రహాలను ఉచ్ఛ గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టాలు కలుగుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆశించిన వ్యక్తితో పెళ్లినిశ్చయం అవుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.



