- Telugu News Photo Gallery Spiritual photos Rakshi Festival 2023: Unique Rakhi Made With Natural Ingredient Cow Dung
Cow Dung Rakhis: పవిత్రమైన అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండగ.. మార్కెట్‌లో గోమయ రాఖీలు
రక్షాబంధన్ అంటే ఎంతో ప్రసిద్ధి సాంప్రదాయకంగా హిందూ ఆచార వేడుక. ప్రతి ఒక్క హిందు సాంప్రదాయంలో రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రాఖి రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని రకరకాల పేర్లతో ఈ పండుగని ప్రాంతాల వారిగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అక్క తమ్ముళ్లు అన్న చెల్లెలకు మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశీయంగా ఎన్నో రకాల రాఖీలు మార్కెట్లల్లో కనువిందు చేస్తున్నా.. ‘గోమయం’తో వినూత్నంగా తయారు చేసిన రాఖీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
S Navya Chaitanya | Edited By: Surya Kala
Updated on: Aug 24, 2023 | 12:17 PM

తోబుట్టువుల మధ్య ఉన్న సంబంధం వర్ణించలేనిది అందుకే మన భారతదేశంలో ఈ పండుగను తోబుట్టువులకే అంకితం చేస్తారు.రాఖీ అంటే బొమ్మల రాఖి, ప్లాస్టిక్ లేదా దారాలతో చేసిన రాఖి మనకి తెలుసు. కానీ గోమయంతో తయారుచేసిన రాఖీలు కూడా ఈ సంవత్సరం ఎంతో డిమాండ్ ఉంది.

హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయంతో రాఖీలు తయారు చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ కే కాకుండా బెంగళూరు, పూణే, ఆంధ్రప్రదేశ్ ఇలా పలు జిల్లాలకు రాష్ట్రాలకు అమ్ముతున్నారు. పక్క రాష్ట్రాల నుండి గోమయం రాఖీలకు డిమాండ్ చాలా పెరిగింది.

ఆవు పేడలో చింతపిక్కల పొడి కలిపి సహజసిద్ధమైన రంగులు వేసి పవిత్రమైన రాఖిని తయారు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 15 రాఖీలు తయారుచేసి ఇతర రాష్ట్రాలకు పంపించారు. ప్లాస్టిక్ తో తయారు చేసే రాఖీలు భూమిలో కలిసిపోవడానికి సంవత్సరాలు సమయం పడుతుంది.

కాలుష్యాన్ని కూడా పెంచుతుంది. గోమయంతో చేసిన రాఖీలు భూసారాన్ని కాపాడుతుంది, ఎటువంటి కాలుష్యాన్ని పెంచదు..అయితే గోమయం రాఖీలు కేవలం ప్రకృతిని కాపాడటమే కాకుండా పరోక్షంగా గోమాత సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాము.అందుకని ప్లాస్టిక్ రాఖీలు కొనేముందు ఒక్క క్షణం ఆలోచించండి.

‘పేడ’తో వీరు తయారు చేసే రాఖీలు భూమిలో సులువుగా కలిసిపోతాయి. కనుక గోమయం రాఖీలు వాడండి. రక్షంగా గోమాత సేవ చేయండి. పర్యావరణాన్ని కాపాడండి.





























