- Telugu News Photo Gallery Spiritual photos Miniature artist Gurram Dayakar creates the idol shape of Lord Shiva on a grain of rice in Jagtial district
Micro Art: బియ్యపు గింజపై ఆదిబిక్షువు రూపం.. అన్నపూర్ణను సైతం ఆకర్షిస్తోన్న కళాత్మకం..
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. ప్రతి ఆలయంలో అభిషేకాలు, అలంకరణ, కళ్యాణాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. అయితే ఈమధ్య కాలంలో మైక్రో ఆర్ట్ అత్యంత ఆదరణ పొందుతోంది. చిన్నని రూపంలో గొప్ప రూపాన్ని నిర్మించేందుకు కళాకారులు సిద్దమవుతున్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా బియ్యపు గింజ రంధ్రంలో శివయ్య ఆకారాన్ని రూపోందించారు సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్.
Updated on: Mar 07, 2024 | 9:21 PM

మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. ప్రతి ఆలయంలో అభిషేకాలు, అలంకరణ, కళ్యాణాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు.

అయితే ఈమధ్య కాలంలో మైక్రో ఆర్ట్ అత్యంత ఆదరణ పొందుతోంది. చిన్నని రూపంలో గొప్ప రూపాన్ని నిర్మించేందుకు కళాకారులు సిద్దమవుతున్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా బియ్యపు గింజ రంధ్రంలో శివయ్య ఆకారాన్ని రూపోందించారు సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్.

దీనికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివ నామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు జరుపుకునే సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు.

గతంలో ఈయన డాక్టరేట్తో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. తనలోని కళాత్మకప్రతిభను పదిమందికి చూపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడి పేరు డా.గుర్రం దయాకర్.

బియ్యపు గింజలో శివుని విగ్రహాన్ని తయారు చేశారు. అలాగే పచ్చని పూల మొక్కలు రూపొందించాడు. వీటిని రూపొందించడానికి గుండు పిన్ను, నైలాన్ బియ్యపు గింజ, కలర్స్ పెన్సిల్ వాడడం జరిగిందని చెప్పారు.

ఇలాంటి అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేయుటకు 18 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. ఈ విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది. భక్తులు వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇలాంటి విగ్రహం ఎన్నడూ చూడలేదని భక్తులు చెబుతున్నారు. అత్యంత భక్తి శ్రద్దల మధ్య ఈ విగ్రహాన్ని తయారు చేశామని కళాకారుడు అంటున్నారు.
