- Telugu News Photo Gallery Spiritual photos Mars transit in scorpio on october 27, 2025: these zodiac signs are get good luck
Mangal Gochar: దీపావళి తర్వాత సొంత రాశిలోకి కుజుడు.. ఈ రాశులపై కనక వర్షం
దీపావళి తర్వాత కుజుడు తన రాశిని మార్చుకోనున్నాడు. తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.ఈ సంచారం వలన అనేక రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. విజయాన్ని కలిగిస్తుంది. అంతేకాదు కెరీర్ లో వృద్ధి, ఆర్ధిక లాభాల కోసం ఎదురుచ్తున్నవారికి ఈ సమయం సువర్ణావకాశామే. ఈ రోజు ఏ రాశులపై కుజుడు కనక వర్షం కురిపిస్తాడో తెలుసుకుందాం
Updated on: Oct 16, 2025 | 5:04 PM

జ్యోతిషశాస్త్రంలో కుజుడు చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. కుజుడు అగ్నితత్వానికి అధిపతి. ఉగ్ర స్వభావం కలవాడు. అందుకనే కుజుడిని అంగారకుడు అని కూడా అంటారు. కుజుడు శక్తి, ధైర్యం, శౌర్యం, విశ్వాసం ,నాయకత్వానికి కారకంగా పరిగణిస్తారు. కుజుడు ఏదైనా రాశిలో సంచరింనప్పుడు.. ఆ ప్రభావం జీవితంలోని ప్రతి అంశంలోనూ, కెరీర్, సంపద, ఆరోగ్యం, సంబంధాలలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. అయితే అది అక్టోబర్ 27, 2025న తన సొంత రాశి అయిన వృశ్చికంలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు తన సొంత రాశిలో అడుగు పెట్టడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

కుజ సంచారము వలన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ కాలంలో కొన్ని రాశులకు సువర్ణావకాశాలు లభిస్తాయి. విజయం, పురోగతి , ఆర్థిక లాభాలను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి కొత్త పనులను ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సంచారము ప్రతి రాశిపై వేర్వేరుగా ప్రభావం చూపుతుంది. కానీ కొంతమందికి ఇది చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటంటే..

తులారాశి : వీరికి కుజ గ్రహ సంచారము అదృష్ట గృహంలో జరుగుతోంది. దీనిని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో అదృష్టం, విజయానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్ట్ రావచ్చు. విదేశీ ప్రయాణం లేదా దూర ప్రయాణం ప్రయోజనాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశి లగ్న రాశిలో కుజుడు సంచరిస్తాడు. ఈ స్థానం వీరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, శక్తిని నింపుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు లేదా విస్తరణల ద్వారా మంచి లాభాలను పొందుతారు. మీరు ఏదైనా పోటీ లేదా క్రీడలలో పాల్గొంటే..అసాధారణంగా ప్రతిభ చూపి రాణిస్తారు.

మీన రాశి: మీన రాశి వారి అదృష్టాన్ని, పనిని కుజుడు సానుకూలంగా ప్రభావితం చేస్తాడు. ఈ సమయం వీరు తమ కష్టానికి తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం ఆధ్యాత్మికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ధ్యానం, ఆధ్యాత్మిక సాధన,తీర్థయాత్రల వైపు ఆకర్షితులవుతారు. ఇంట్లో శాంతి, సామరస్యంతో కూడిన వాతావరణం కూడా ఉంటుంది.




