AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: జాడే మొక్కను ఇంట్లో ఈ దిశలో పెంచుకోండి.. సంపదను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది

ఇండోర్ ప్లాంట్స్ లో జాడే మొక్క ఒకటి.. దీనిని క్రాసులా ఒవాటా అని కూడా పిలుస్తారు. ఈ మొక్కకు వాస్తు శాస్త్రంలోనే కాదు ఫెంగ్ షుయ్ ప్రకారం కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ మొక్కను కొన్ని సంస్కృతుల్లో డబ్బు మొక్క అని కూడా పిలుస్తారు. ఈ జాడే మొక్క అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణింపబడుతున్నది. ఈ మొక్కను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకోవడం వలన సంపద, సానుకూల శక్తి , సామరస్యాన్ని ఆకర్షిస్తుంది. ఈ రోజు ఈ మొక్క ని ఇంట్లో పెట్టుకోవాలంటే పాటించాల్సిన వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Oct 16, 2025 | 4:39 PM

Share
వాస్తు శాస్త్రంలోనే కాదు ఫెంగ్ షుయ్ లో కూడా జాడే మొక్కకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కని క్రాసులా ఒవాటా అని , లక్కీ ప్లాంట్ లేదా మనీ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ ఇండోర్ ప్లాంట్ అదృష్టం, శ్రేయస్సును తెస్తుందని, సంపదను ఆకర్షించడమే కాదు ఇంట్లో సానుకూల శక్తిని కూడా తీసుకువస్తుందని నమ్ముతారు. ఈ మొక్క వైద్య గుణాలను కూడా కలిగి ఉంది. గాయాలు, కడుపు నొప్పి , మొటిమల వంటి సమస్యలకు చికిత్స చేయడానికి దీని ఆకుల సారాన్ని ఉపయోగిస్తారు. జాడే మొక్కకు సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా సంవత్సరాలు పెరుగుతుంది. సరైన జాగ్రత్తలతో జాడే మొక్కను పెంచితే  50-70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తుంది.

1 / 8
దీని గుండ్రని, నాణెం లాంటి ఆకులు శ్రేయస్సు , సంపదను సూచిస్తాయి. ఇది ఇళ్ళు , ఆఫీసుల్లో ఇండోర్ మొక్కగా ప్రసిద్ధ ఎంపికగా మారింది. వాస్తు నిపుణులు శక్తి ప్రవాహాన్ని పెంచడానికి, ఆర్థిక లాభాలను ఆకర్షించడానికి ఎక్కడ పెట్టాలో కొన్ని నియమాలను  సూచిస్తున్నారు.

2 / 8
వాస్తు సూత్రాల ప్రకారం ఇల్లు లేదా కార్యాలయ ప్రవేశ ద్వారం దగ్గర జాడే మొక్కను ఉంచడం వల్ల అదృష్టం, సానుకూల వైబ్‌లు వస్తాయి. ఇది సానుకూల సంబంధాలను పెంపొందిస్తుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. వ్యాపార యజమానులు ఆఫీసులో  లేదా దుకాణం ప్రవేశ ద్వారం వద్ద మొక్కను ఉంచడం వల్ల కొత్త అవకాశాలు, ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

3 / 8
వాస్తు శాస్త్రంలో జాడే మొక్క ప్రధానంగా సంపదతో ముడిపడి ఉన్నప్పటికీ.. ఇది ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నివారిణిగా పనిచేస్తుంది, ఆరోగ్యకరమైన, సమతుల్య వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీని శక్తివంతమైన ఆకుపచ్చ రంగు మనస్సును ప్రశాంతపరుస్తుందని.. ప్రశాంతత, శాంతిని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు.

4 / 8

ఇంటిలో లేదా ఆఫీసులో ఆగ్నేయ మూలలో జాడే మొక్కను ఉంచడం శుభప్రదం. ఈ దిశను శుక్రుడు పాలిస్తాడు. ఆర్థికంతో ముడిపడి ఉంటాడు. ఇక్కడ ఒక జాడే మొక్క పెట్టడం వలన శ్రేయస్సు, ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. జాడే మొక్కను తూర్పున ఉంచడం వల్ల సామరస్యం, మంచి ఆరోగ్యం , బలమైన కుటుంబ బంధాలు పెంపొందుతాయి.

5 / 8
 
పచ్చ రంగు వృద్ధికి , జ్ఞానానికి చిహ్నం. కనుక ఈ మొక్కను మీ పని చేస్తున్న డెస్క్‌పై పెట్టుకోవడం వల్ల దృష్టి, సృజనాత్మకత, విజయాన్ని పెంచుతుంది. లివింగ్ రూమ్‌లో పెట్టుకుంటే సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది.

6 / 8
క్యాష్ బాక్స్ లేదా సేఫ్ దగ్గర ఈ జాడే మొక్కను పెట్టుకుంటే.. అంటే డబ్బు లేదా విలువైన వస్తువులను పెట్టుకునే ప్రదేశానికి దగ్గరగా ఈ మొక్కని పెంచుకుంటే ఇది సంపదను ఆకర్షిస్తుందని, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుందని నమ్ముతారు. బెడ్ రూమ్ లోని ఆగ్నేయ వైపున  కిటికీ దగ్గరగా ఈ మొక్కని పెట్టుకుంటే.. ఇది ప్రశాంతమైన శక్తిని తెస్తుంది. అయితే మొక్కను మంచానికి చాలా దగ్గరగా ఉంచకూడదు.

7 / 8
 
జాడే మొక్క శాంతి, ఆధ్యాత్మిక సమతుల్యతను సూచిస్తుంది. ఇది ప్రార్థనలు లేదా ధ్యానం సమయంలో ఏకాగ్రతను , ప్రశాంతమైన మనస్సును పెంచుతుంది. కారిడార్ల వంటి పరివర్తన ప్రదేశాలలో ఒక జాడే మొక్క పెట్టుకుంటే.. ఇంటి అంతటా శక్తిని ప్రవహించేలా చేస్తుంది.

8 / 8