- Telugu News Photo Gallery Spiritual photos If you wear a Karungali Mala, you must follow these rules
Karungali Mala Rules: కరుంగాలి మాల వేసుకుంటున్నారా.? ఈ నియమాలు పాటించాల్సిందే..
కరుంగాలి మాల.. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సామాన్యులు నుంచి సెలెబ్రెటీల వరకు ఇది మేడలో వేసుకుంటున్నారు. అయితే మీకు నచ్చినట్టు వేసుకోవడం కుదరదు. ఇది వేసుకున్న తర్వాత కొన్ని నియమాలు తప్పకుండ పాటించాలి అంటున్నారు పండితులు. లేకపోతే ఈ మాల వేసుకొన్న ఎలాంటి ఫలితం ఉండదు అంటున్నారు. మరి ఆ నియమాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందామా..
Updated on: Jul 05, 2025 | 1:34 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన జాతకంలో ఆరవ స్థానం పూర్వజన్మ కర్మలను సూచిస్తుంది. ఈ కర్మలు మన జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి. ఈ మాల కర్మలను తొలగించడంలో సహాయపడుతుందని అంటున్నారు పండితులు. కానీ ఈ మాల ధారణకు కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించినవారికి మాత్రమే కరుంగలి మాల దాని ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రధానమైన నియమం అబద్ధం ఆడకూడదు. కలియుగంలో అబద్ధం చెప్పడం చాలా సులభం, కానీ కరుంగలి మాల ధారణకు ఇది అత్యంత ముఖ్యం. అబద్ధం మన వాక్కు శుద్ధిని నాశనం చేస్తుంది. శుక్రుడు వాక్కుకు కారకుడు కాగా, శని కర్మకు కారకుడు. కరుంగలి మాల శని గ్రహం ప్రభావంతో ముడిపడి ఉంది. కాబట్టి వాక్కు శుద్ధిని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

మాల ధరించే ముందు, పదకొండు, ఇరవై ఒకటి లేదా నలభై ఒకటి రోజులు ప్రతిరోజూ "ఓం స్కందాయ నమః" మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి. బుధవారం, గురువారం. శుక్రవారం, శనివారం లేదా పంచమి, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి వంటి పర్వదినాల్లో మాలను ధరించవచ్చు.

టాయిలెట్ వెళ్ళేటప్పుడు మాలను తీసివేయాలి. ఎవరైనా ఏ మతం కులం వాళ్ళైనా ఈ మాలను ధరించవచ్చు. కరుంగలి మాల మన ఆరాను రక్షిస్తుంది. బ్యాడ్ ఎనర్జీని దూరం చేస్తుంది. నియమాలను పాటించడం ద్వారా మాత్రమే ఈ మాల పూర్తి ప్రయోజనాలను పొందగలం.

ఇది తమిళనాడులోని దిండిగల్ జిల్లా రామలింగంపట్టిలో ఉన్న పాతాళ సెంబు మురుగన్ దేవాలయంలో ఈ మాలను తీసుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా కరుంగాలి మాల హోమ్ డెలివరీ అంటూ చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ నమ్మవద్దు మీకు ఈ మాల కావాలంటే దేవాలయంలో మాత్రమే తీసుకోవాలి. లేదంటే గుడి ఎవరైనా వెళ్తే వారితో తెప్పించుకోండి. సోషల్ మీడియా వచ్చనవి ఫేక్ మాలలని, వాటితో లాభాలు ఉండవని మురుగన్ ఆలయ సిబ్బంది అంటున్నారు.




