- Telugu News Photo Gallery Spiritual photos History of andhra mahavishnu srikakulam temple in krishna district
Andhra Vishnu: బ్రహ్మ ప్రయత్నంతోనే ఉద్భవించిన … శ్రీకాకుళ ఆంధ్రమహా విష్ణు క్షేత్రం.. విశిష్టత
Andhra Vishnu: తెలుగు నేలలో అడుగడుగునా గుడి ఉంది. ఆ గుడి లో ఒక దైవం ఉంది. ఆ విగ్రహ రూపానికి అనేక నామాలు ఉన్నాయి. ఆ ఆలయాలను దర్శిస్తూ.. దైవాన్ని మనం భక్తి తో,శ్రద్ద తో శక్తి కొద్దీ కొలుస్తున్నాం.. ఏ రీతిని కొలిచిన.. కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే దేవాలయాల్లో ఒకటి శ్రీ మహావిష్ణువు ఆలయం. శ్రీ మహావిష్ణువు మనకోసం వైకుంఠన్నీ వదిలి వచ్చి కొలువైన క్షేత్రం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం.
Updated on: Jun 22, 2021 | 10:03 PM

ఈ గుడి రాజగోపురం ఐదు అంతస్థులు ఉంటుంది. ఈ రాజగోపురాన్ని శాలివాహనాశకం 1081 లో (క్రీ. శ. 10 వ శతాబ్దంలో) చోళరాజు అయిన అనంత దండపాలుడు నిర్మించాడు. ఈ విషయం రాజగోపుర స్తంభం మీదగల శాసనం ద్వారా తెలుస్తోంది.

విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ దండయాత్ర లో భాగంగా ఇక్కడి మందిరం గురించి విని స్వామిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. అలాగే క్రీ.శ. 1519 లో ఇక్కడ ఉన్న ఒక మండపంలో కూర్చొని విష్ణువును తలుచుకుంటూ అముక్త మాల్యద అనే గ్రంధాన్ని రచించాడు. ఇప్పడు ఆ మండపాన్ని ఆముక్త మాల్యద మండపం అని పిలుస్తారు

ఈ గుడి రాజగోపురం ఐదు అంతస్థులు ఉంటుంది. ఈ రాజగోపురాన్ని శాలివాహనాశకం 1081 లో (క్రీ. శ. 10 వ శతాబ్దంలో) చోళరాజు అయిన అనంత దండపాలుడు నిర్మించాడు. ఈ విషయం రాజగోపుర స్తంభం మీదగల శాసనం ద్వారా తెలుస్తోంది.

శ్రీకాకుళేశ్వరాలయం ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది. ఈ గుడిలోని ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడో పూర్వకాలంలో వెలిగించిన హోమగుండం లోని అగ్ని హోత్రం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తు బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉధ్బవించిందని ఒక పురాణ కథనం. భక్తుల నమ్మ\

విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ దండయాత్ర లో భాగంగా ఇక్కడి మందిరం గురించి విని స్వామిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. అలాగే క్రీ.శ. 1519 లో ఇక్కడ ఉన్న ఒక మండపంలో కూర్చొని విష్ణువును తలుచుకుంటూ అముక్త మాల్యద అనే గ్రంధాన్ని రచించాడు. ఇప్పడు ఆ మండపాన్ని ఆముక్త మాల్యద మండపం అని పిలుస్తారు

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భక్తులు భారీగా ఈ ఆలయానికి తరలి వస్తారు. విజయవాడ మహానగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం గ్రామానికి విజయవాడ, ఘంటసాల, కోడలి, కొల్లూరు ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు సౌకర్యం కలదు. విజయవాడ నుండి ప్రతి రోజూ శ్రీకాకుళం మీదుగా ఘంటసాల మండలానికి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి.