- Telugu News Photo Gallery Spiritual photos Guru Rahu Star Parivarthan These zodiac signs to get sudden money luck details in telugu
Money Astrology: గురు, రాహువుల మధ్య నక్షత్ర పరివర్తన.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభాలు!
ప్రస్తుతం గురు, రాహువుల మధ్య నక్షత్ర పరివర్తన జరిగింది. గురువుకు చెందిన పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు, రాహువుకు చెందిన ఆర్ద్రా నక్షత్రంలో గురువు సంచారం చేస్తున్నారు. ఈ పరివర్తన ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. అంతేకాక, గురువు తన నవమ దృష్టితో రాహువును వీక్షించడం కూడా జరుగుతోంది. గురు, రాహువుల మధ్య నక్షత్ర పరివర్తన, రాహువుపై గురు దృష్టి వల్ల ఆకస్మిక ధన లాభం, జీవనశైలిలో మార్పు, స్వగృహ యోగం, ఆదాయ వృద్ధి వంటివి కలిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, ధనూ రాశులవారి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
Updated on: Jun 18, 2025 | 6:57 PM

మేషం: ఈ నక్షత్ర పరివర్తన వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభంతో పాటు ఆకస్మిక ఉద్యోగ లాభం, ఆకస్మిక పదవీ లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. పిల్లల్లో ఒకరు చదువులు, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

వృషభం: గురు, రాహువుల మధ్య నక్షత్ర పరివర్తన వల్ల ధన, ఉద్యోగ స్థానాలు ప్రభావితం అవుతున్నందు వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, బకాయిలు వసూలు కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. మరింత ఎక్కువగా జీతాలిచ్చే ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం కలుగుతుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కూడా కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్, యాక్టివిటీతో పాటు రాబడి కూడా అంచనాలను మించుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

మిథునం: గురు, రాహువుల నక్షత్ర పరివర్తన వల్ల ఈ రాశివారికి ఒకటి రెండు అతి ముఖ్యమైన అదృష్టాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసి సంపాదించాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్ప కుండా నెరవేరుతుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, భారీ జీతభత్యాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.

సింహం: ఈ నక్షత్ర పరివర్తన వల్ల ఈ రాశివారికి లాభ స్థానంతో లింకు ఏర్పడింది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. లాభసాటి పరిచయాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కుదరడం వంటివి జరుగుతాయి. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది.

తుల: భాగ్య స్థానంలో ఉన్న గురువుతో రాహువుకు నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల ఆస్తి లాభం, ఆదాయ వృద్ధి, ఆకస్మిక ధన లాభం వంటివి తప్పకుండా కలుగుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి హోదా పెరిగే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి ఈ నక్షత్ర పరివర్తన వల్ల ఊహించని శుభ యోగాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడి, జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ వృద్ధి మార్గాలన్నీ లాభాల పంట పండిస్తాయి. ఆస్తి వివాదాలుఅనుకూలంగా పరిష్కారమవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.



