- Telugu News Photo gallery Spiritual photos Gudivada mandal moturu sri ganganamma temple history and significance
రెండువందల ఏళ్లుగా గ్రామాన్ని కాపాడుతున్న శ్రీ గంగానమ్మ.. ఇప్పటికీ అక్కడి ప్రజలకు కలలోకి కనిపించే మోటూరు గ్రామ దేవత..
గ్రామ దేవతలే గ్రామానికి అధిష్టాన దేవతలు అని మన సంస్కృతిలో గ్రామదేవతలకు పెద్దపీట వేశారు. గ్రామదేవతలు ఆదిశక్తి అంశలు ప్రకృతి శక్తులు అంటుంది దేవి భాగవతం.. పేరు ఏదైనా కావచ్చు ఆరాధన పద్ధతి మారవచ్చు కానీ శక్తి ఒకటే.. గ్రామ దేవత అంటే ఆ గ్రామంలో ఉండే అందరి ఇంటి ఆడపడుచు.
Updated on: May 02, 2021 | 2:49 PM

కృష్ణాజిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని శ్రీ గంగానమ్మ.. రెండు వందల సంవత్సరాలకు పైబడిన పురాతన చరిత్ర కలిగిన మహిమాన్విత గ్రామదేవతగా ప్రసిద్ధి. అక్కడి ప్రజలు గంగానమ్మ దేవిని గ్రామ దేవత.. అమ్మవారుగా పూజిస్తుంటారు.

వందల సంవత్సరాల క్రితం ఆ తల్లి విగ్రహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన వంశస్థుల వారితోనే 2009లో నూతన దేవాలయ శంకుస్థాపన జరిపించారు. మహా చండీ యాగం అనేక పూజలు జరిపించారు. ఇక్కడి అమ్మవారికి అతీతశక్తులు ఉన్నాయని.. గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా గంగానమ్మ వారు కాపాడుతుందని అక్కడి ప్రజల విశ్వాసం.

ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉందని.. ఇందుకు కారణం.. గంగానమ్మ ఆ గ్రామంలో.. పరిసరాల ప్రాంతాల్లో సంచరిస్తుందని.. అందుకే ఇప్పటికీ ఎలాంటి వ్యాధులు తమ వరకు రాలేవని అక్కడి ప్రజలు చెబుతుంటారు.

మోటూరు గ్రామ ప్రజలు గంగానమ్మ దేవికి ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ గ్రామం ఆనవాయితీ ప్రకారం ఆ బంగారు తల్లిని కొంగుబంగారంగా కొలిచి జాతర వేడుకలు జరిపించి గ్రామస్తులందరూ ఆ తల్లి దీవెనలు పొందుతారు.

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు, అన్నదాన కార్యక్రమం, ఘటాల ఊరేగింపు, ప్రతి ఇంటి నుంచి గ్రామ దేవత గంగానమ్మ తల్లి కి బోనం సమర్పించి అంగరంగ వైభవంగా జరుపుతారు.

మోటూరు గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ గంగానమ్మ అమ్మవారికి జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ప్రతి మాసంలో అమావాస్య రోజున అమ్మవారికి పంచామృతాలతో పళ్ళ రసాలతో అభిషేకం వైభవోపేతంగా జరిపిస్తారు.

మోటూరు శ్రీ గంగానమ్మ..+





























