- Telugu News Photo Gallery Spiritual photos Beneficial Mercury Saturn: Problem Solving and Wealth Opportunities for these zodiac signs
Lord Shani Dev: శని, బుధుల అనుగ్రహం.. ఆ రాశుల వారికి ధన యోగాలు!
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని, బుధులు కలిసినా, పరస్పర దృష్టి కలిగినా ఏ రూపంలో ఉన్న సమస్య లైనా చాలావరకు పరిష్కారమవుతాయి. ఈ రెండు గ్రహాలు మిత్ర గ్రహాలు కావడం, బుధుడు బుద్ధి బలానికి, శని శ్రమకు కారకులు కావడం వల్ల ఎటువంటి సమస్యలైనా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. పైగా బుధుడు కన్యారాశిలో ఉచ్ఛస్థితిలోకి ప్రవేశిస్తుండడం వల్ల బుధుడికి రెట్టింపు బలం కలిగింది. ఈ రెండు మిత్ర గ్రహాల సమ సప్తక దృష్టి వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు సమస్యల పరిష్కారంతో పాటు ధన యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. బుధుడు అక్టోబర్ 2 వరకూ కన్యారాశిలో, ఉచ్ఛ స్థితిలో కొనసాగుతాడు.
Updated on: Sep 15, 2025 | 7:43 PM

వృషభం: ఈ రాశికి అత్యంత శుభులైన శని, బుధుల మద్య సమ సప్తక దృష్టి ఏర్పడడం వల్ల వీరు ఎటు వంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వీరు అన్ని విధాలుగా తమ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడ తాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ మార్గాలన్నీ సఫలమై ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పూర్తిగా పరిష్కారించుకుంటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

మిథునం: రాశ్యధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు దశమ స్థానంలో ఉన్న శనిని చూడడం వల్ల ఉద్యోగంలో ఆటంకాలు, అవరోధాలను అధిగమించి అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాటపట్టిస్తారు. కుటుంబంలో పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమ స్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలకు మార్గం సుగమం అవుతుంది.

కన్య: రాశ్యధిపతి బుధుడు ఉచ్ఛపట్టడం, తన మిత్రుడైన శనితో పరస్పర దృష్టి కలిగి ఉండడం వల్ల ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభి స్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమై మనశ్శాంతి లభిస్తుంది. రావలసిన సొమ్ము, బాకీలు, బకాయిలను వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. శత్రు, రోగ, రుణ బాధలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: ఈ రాశివారికి ఈ రెండు మిత్ర గ్రహాల పరస్పర దృష్టి వల్ల విదేశీయానానికి ఆటంకాలు, అవ రోధాలు తొలగిపోతాయి. ప్రభుత్వ అధికార ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూ లలో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను, సమస్యలను పూర్తిగా చక్కబెడ తారు. అనారోగ్య సమస్యలు దాదాపు మటుమాయం అవుతాయి. గృహ, ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థితిలో ఉంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

మకరం: ఈ రాశికి ఈ రెండు గ్రహాలు శుభ గ్రహాలైనందువల్ల, రాశ్యధిపతి శని మీద భాగ్యాధిపతి బుధుడి దృష్టి పడడం వల్ల విదేశీయానానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

కుంభం:రాశ్యధిపతి శని మీద ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడి దృష్టి పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. రావలసిన సొమ్మును, బాకీలను రాబట్టుకుంటారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడానికి సరైన ఆలోచనలు సాగిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గే అవకాశం ఉంది.



