- Telugu News Photo Gallery Spiritual photos Avoid These Vastu Mistakes Immediately or else you will may face Severe Financial Problems
Vastu Tips: ఇంట్లో ఖాళీగా ఉండకూడని 3 వస్తువులు.. ఉంటే ధన నష్టం తప్పదంటున్న నిపుణులు..!
Vastu Tips: హిందూ ధర్మంలో వాస్తుకు ప్రముఖ స్థానం ఉంది. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంలోనే కాక, ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ నియమాలు పాటించాలి. లేకుంటే ధన దేవత శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం వస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ మేరకు ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు నియమాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి.
Updated on: Sep 21, 2023 | 7:03 PM

వాస్తు నిపుణుల ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఖాళీగా ఉండకూదని పెద్దలు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో ధన నష్టం కలుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇంట్లో ఖాళీగా ఉండకూడని ఆ వస్తువులు ఏమిటి..? తెలుసుకుందాం..

లాకర్: డబ్బులు దాచుకునే లాకర్ లేదా పర్స్ కూడా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఇవి లక్ష్మీదేవి నివాసం ఉండే ప్రాంతాలు. ఇలా డబ్బును దాచుకునే ప్రదేశాలను ఖాళీగా ఉంచితే ధనదేవతకు కోపం వచ్చి మీ నుంచి దూరంగా వెళ్లిపోతుందంట.

ధాన్యం: వాస్తు ప్రకారం ఇంట్లో ధాన్యం పాత్ర లేదా ధాన్యం నిల్వచేసుకునే సంచి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఇలా ఉండడం ప్రతికూలతకు సంకేతం. అలాగే ఇంట్లో ధాన్యం లేకుంటే కరువు ఏర్పడుతుందని, కరువు ఏర్పడిన చోట లక్ష్మి దేవత నివాసం ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

తాగు నీరు: ఇంట్లో మంచి నీళ్ల పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. నీటి పాత్రలు ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పేదరికం దాపరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి పాత్రలు ఖాళీగా ఉండే ఇంట్లోనే కాక నీటిని వృధాగా పారబోసే వారి ఇంట్లోవారిని కూడా లక్ష్మీదేవి అనుగ్రహించదంట.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.




