- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips for love: These ways to please Venus according to astrology
జీవితంలో ప్రేమ, ఆనందం కోసం ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి.. జ్యోతిష్య పరిహారాలు ఏమిటంటే..
గ్రహాలు మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతి గ్రహానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. జాతకంలో గ్రహాల స్థానం మంచి లేదా చెడు ఫలితాలను కలిగిస్తాయి. జీవితంలోని ప్రేమని బలోపేతం చేయడానికి సంబంధించిన కొన్ని జ్యోతిషశాస్త్ర నివారణలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రేమ జీవితాన్ని మెరుగుపడాలంటే జాతకంలో ఏ గ్రహం స్థానం బలంగా ఉండాలి? ఎటువంటి నివారణ చర్యలు పాటించడం వలన గ్రహ స్థానం బలపడి.. జీవితంలో ప్రేమ పెరుగుతుందో తెలుసుకుందాం..
Updated on: Aug 09, 2025 | 5:31 PM

జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహం ప్రేమ, వివాహాన్ని సూచిస్తుంది. ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే పెళ్లిలో ప్రేమలో సమస్యలు కలుగుతాయి. కనుక జాతకంలో శుక్ర స్థానం బలంగా ఉంటే వారి వైవాహిక జీవితానికి అది ఒక వరం.

జీవితంలో ప్రేమ, భాగస్వాముల మధ్య ప్రేమ, బంధాన్ని కొనసాగించడానికి శుక్ర గ్రహం బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రేమ, శృంగారం, ఆకర్షణ, భౌతిక ఆనందం. అందానికి శుక్రుడు బాధ్యత వహిస్తాడు. అటువంటి పరిస్థితిలో శుక్ర గ్రహాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

వైవాహిక జీవితంలో శృంగారం: ప్రేమికుల జీవితంలో లేదా దంపతుల జీవితంలో ప్రేమ లోపించినా మీ భాగస్వామితో కలిసి ఉండకపోయినా శుక్రవారం ఉపవాసం ఉండండి. ఇది శుక్రుడిని బలోపేతం చేస్తుంది . లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా పొందుతారు. ప్రేమ జీవితం లేదా వివాహం విజయవంతం కావడానికి శుక్రుడిని పూజించండి. శుక్రుని బీజ మంత్రం ఓం శుం శుక్రాయ నమః అని 64 వేల సార్లు జపించండి.

శుక్ర గ్రహాన్ని బలోపేతం చేయడానికి చర్యలు: శుక్రుడిని బలోపేతం చేయడానికి పాలు, బియ్యం, చక్కెర మిఠాయి, తెల్లటి వస్త్రం లేదా సుగంధ ద్రవ్యాలు, పెరుగు, తెల్లని పువ్వులు, తెల్ల చందనం మొదలైనవి దానం చేయండి. ఈ వస్తువులను శుక్రవారం మాత్రమే దానం చేయడం వలన ఫలితం దక్కుతుంది.

4 నుండి 5 రట్టి(బరువు) వజ్రం ధరించండి: జ్యోతిష్కుడి సలహా మేరకు 4 నుంచి 5 రట్టి బరువున్న వజ్రాన్ని లేదా కొన్ని ప్రత్యేక రత్నాలను ధరించడం అంటే తెల్లటి పుష్పరాగము, స్ఫటికం, ఒపల్ రత్నాలు మొదలైన వాటిని ధరిస్తే జాతకంలో శుక్ర గ్రహం బలంగా మారుతుంది. అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు మీ జాతకాన్ని జ్యోతిష్కుడికి చూపించండి.

నలుపు రంగుని దరించవద్దు: జీవితంలో ప్రేమ పెరగాలంటే నలుపు రంగుకి దూరంగా ఉండండి. నలుపు రంగు దుస్తులను దరించవద్దు. వివాహితులైతే తమ భాగస్వామికి నలుపు రంగు వస్తువులను లేదా పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వవద్దు. ఎందుకంటే ఈ వస్తువులు మీ ప్రేమను ప్రతికూల శక్తితో ప్రభావితం చేస్తాయి.

శివ మంత్రాన్ని జపించండి: జీవితంలో ప్రేమ పెరగాలన్నా, దంపతుల మధ్య బంధం మధురంగా ఉండాలన్నా శివ మంత్రాన్ని జపించండి. "శక్తివంతమైన శివ స్తోత్రం" మంత్రాన్ని 21 రోజులు నిరంతరం 5 సార్లు జపించండి. ఇది ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. జంట మధ్య ఏర్పడిన సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.




