Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konark Facts: ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గురించి కొన్ని ఫాక్ట్స్ మీ కోసం..

కోణార్క్.. ఒడిశాలో ఉన్న ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇది భువనేశ్వర్ నుండి 66 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఓ సూర్య దేవాలయం. అప్పట్లో ఈ ఆలయం భక్తులతో పూజలతో వైభవంగా కనిపించేది. ఆక్రమణదారులు కూల్చివేతతో శిధిలం అయింది. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. కోణార్క్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Jul 04, 2025 | 1:30 PM

Share
కోణార్క్ ఆలయాన్ని 1250 AD శతాబ్దంలో రాజు నరసింహ దేవ్ - I నిర్మించారు. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేశారు. ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల రేఖలు ఉన్నాయి. ఈ చక్రాలు గంటలను ప్రదర్శిస్తాయి. వీటి ద్వారా టైం తెలుసుకోవచ్చు.

1 / 5
ఈ దేవాలయం పైభాగంలో అయస్కాంత రాయిని ఉంచినట్లు చెబుతారు. ఆ అయస్కాంత రాయి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 15వ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారని, ఇక్కడ ప్రతిష్టించిన విగ్రహాన్ని కాపాడేందుకు పూజారులు పూరీకి తీసుకెళ్లారని చెబుతారు.

2 / 5
దోపిడీ కారణంగా ఆలయం బాగా దెబ్బతినడంతో ఆలయ ప్రధాన ద్వారం ఇసుకతో కప్పబడి ఉంది. ఈ ఆలయం కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల బారిన పడింది. 18వ శతాబ్దంలో ఆలయ శిఖరం కూలిపోయిందని, ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా గర్భగుడిని మూసివేశారని చెబుతారు.

3 / 5
118 సంవత్సరాల క్రితం, ఆలయంలోని ఈ ఆడిటోరియం గదిని రక్షించడానికి బ్రిటీష్ వారు ఆలయం లోపలి భాగాన్ని ఇసుకతో నింపారు. ఆలయ గర్భగుడిలో గడ్డ కట్టిన ఇసుకను తొలగిస్తే ఆలయ నిర్మాణానికి మరింత నష్టం వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు.

4 / 5
1903లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, పరిరక్షణ పనులను ప్రారంభించింది. సూర్య దేవాలయం లోపలి భాగాల నుంచి ఇసుకను సురక్షితంగా తొలగించేందుకు భారత పురావస్తు శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

5 / 5