- Telugu News Photo Gallery World photos Indian ocean massive tsunami that struck on December 26, 2004 killed 186,983 people in 12 countries.
Biggest Tsunami: ఇదే అతిపెద్ద సునామీ.. 12 దేశాల్లో 186,983 మరణం.. 42,883 మిస్సింగ్..
ప్రపంచవ్యాప్తంగా చాలాసార్లు సునామీలు వచ్చాయి. ఇవి ఆయా దేశాలకు ఎంతోకొంత నష్టాన్ని మిగిల్చాయి. అయితే ఓసారి సముద్రంలో ఓ భారీ భూకంపం 12 దేశాలు తీరప్రాంతంలో భారీ సునామీ శ్రేణికి కారణమైంది. అధిక ప్రాణ నష్టం వాటిల్లింది. ఇందులో మన దేశం కూడా ఉంది. మరి ఆ భారీ సునామీ ఏంటి.? ఆ 12 దేశాలు ఏంటి.? ఏ దేశంలో ఎంత ప్రాణ నష్టం.? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Jul 04, 2025 | 12:59 PM

2004 డిసెంబర్ 26 ఆదివారం సంభవించిన భారీ సునామీలో 12 దేశాల్లో 186,983 మరణించగా, 42,883 మిస్సయ్యారు. మొత్తం సంఖ్య 229,866. ఈ భారీ సునామీ ఇండోనేషియా అత్యధికంగా నష్టపోయింది. ఇందులో 130,736 మరణించగా, 37,000 గల్లంతయ్యారు. మొత్తం 167,736 మంది.

ఆ తర్వాత ద్విప దేశమైన శ్రీలంకలో 35,322 మంది ప్రజలు మరణించారు. ఇక్కడ ప్రజలు మిస్సయినట్టు జాబితా లేదు. భారతదేశం విషయానికి వస్తే.. 12,405 మంది ప్రజలని మృత్యువు కాటేసింది. 5,640 మిస్సయ్యారు. మొత్తం సంఖ్య 18,045.

2004 భారీ సునామీలో నష్టపోయిన దేశాల్లో థాయిలాండ్ కూడా ఉంది. ఈ దేశంలో 8,212 ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మాల్దీవులు 108 మంది ప్రజలను నష్టపోయింది. వారిలో 82 మంది మరణించారు. 26 జాడ తెలియలేదని నివేదికలు చెబుతున్నాయి.

ఈ జాబితాలో సోమాలియా దేశం కూడా ఉంది. ఇక్కడ ప్రజల్లో 78 మరణించగా, 211 మంది మిస్సయ్యారు. మొత్తం సంఖ్య 289. ఈ లిస్టులో మరో తీరప్రాంత దేశం మలేషియా. ఈ దేశం 75 మందిని కోల్పోయింది. వారిలో 69 మంది మృత్యువాత పడ్డారు. ఆరుగురు మిస్సయ్యారు.

2004 డిసెంబర్ 26న వచ్చిన అతి పెద్ద సునామీలో మయన్మార్ దేశంలో 61 ప్రజలను కడలి మింగేసిందని నివేదికలు వెల్లడించాయి. అలాగే టాంజానియాలో 13 మంది, సీషెల్స్‌లో ఇద్దరు, పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇద్దరు, కెన్యాలో ఒకరు మరణించారు.



















