MASLD - MASHతో సంబంధం ఉన్న రోగుల నిద్ర నాణ్యత సాధారణ వ్యక్తుల కంటే చాలా అధ్వాన్నంగా ఉందని అధ్యయనం ఫలితాలు చూపించాయి. అదనంగా, 32% MASLD రోగులు మానసిక ఒత్తిడి కారణంగా నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారని నివేదించారు. అయితే, ఈ సమస్య కేవలం 6% ఆరోగ్యకరమైన పాల్గొనేవారిలో మాత్రమే కనిపించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. MASLD వ్యాధి పుట్టుక నిద్ర లేకపోవడం కీలక పాత్ర పోషిస్తుంది. MASLD నిద్ర సమస్యలను కలిగిస్తుందా లేదా దీనికి విరుద్ధంగా, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, జన్యుశాస్త్రం, రోగనిరోధక ప్రతిస్పందన ప్రధాన కారణాలు కావచ్చు.. అంటూ పరిశోధకులు వివరించారు. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)