ఎముకల నొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి ఎముకలు, కండరాలలో పగుళ్లు వంటివి కూడా కాల్షియం లోపానికి సంకేతాలు. అంతేకాకుండా బోన్స్ పేలుసుగా మారడం, చిన్న దెబ్బ తగిలిన తీవ్రంగా గాయపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం అధికంగా లభించే ఆహారాలు ముఖ్యంగా నువ్వులు, అవిసి కూర కరివేపాకు రాగులు, ఉలవలు, సాల్మన్ చేపలు, వైట్ బీన్స్, బ్రోకలీ పాలు, ఆకుకూరలు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల క్రమంగా ఈ సమస్యను అధిగమించవచ్చు దీంతోపాటు ఎముకల సాంద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యాయామాలు చేయాలంటున్నారు వైద్యనిపుణులు.