- Telugu News Photo Gallery Skinny on Thinning Skin: What causes skin to thin in old age? Treatments and Solutions
Thinning Skin with Age: ముసలి వాళ్లమైపోతే మన చర్మం ఎందుకు ముడతలు పడుతుందో తెలుసా?
అందం శాశ్వతం కాదు అని చాలా మంది అంటుంటారు. వయసు పెరిగే కొద్దీ క్రమంగా అది తరిగిపోతుంది. క్రమంగా వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేకొద్దీ అప్పటి వరకు బిగుతుగా అందంగా కనిపించిన చర్మం నిర్జీవంగా వదులుగా మారిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
Updated on: Dec 01, 2024 | 12:46 PM

వయస్సుతో పాటు చర్మం కూడా చాలా మారుతుంది. మరీ ముఖ్యంగా వృద్ధాప్యంలో చర్మం చాలా పలచగా కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

కొల్లాజెన్, ఎలాస్టిన్ అనేవి చర్మం బిగుతుగా ఉండటానికి ఉపయోగపడతాయి. చర్మానికి బలం అందించి, స్థితిస్థాపకతను నిర్వహించే రెండు ముఖ్యమైన ప్రోటీన్లు. వృద్ధాప్యంలో వాటి పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. కొల్లాజెన్ చర్మాన్ని బలపరుస్తుంది. ఎలాస్టిన్ దానిని ఫ్లెక్సిబుల్ చేస్తుంది. ఈ రెండు ప్రొటీన్ల లోపం వల్ల చర్మం సన్నగా, వదులుగా మారుతుంది.

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. మహిళల్లో రుతువిరతి తర్వాత, ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైనది. దీని వల్ల చర్మంలో తేమ తగ్గి సన్నగా, ముడతలు పడతాయి.

వయసు పెరిగే కొద్దీ చర్మంలో తేమ తగ్గడం మొదలవుతుంది. చర్మంలోని నూనెను ఉత్పత్తి చేసే గ్రంథులు బలహీనంగా మారడం వల్ల చర్మం పొడిబారుతుంది. చర్మంలో తేమ లేకపోదే త్వరగా ముడతలు పడటం ప్రారంభమవుతుంది.

అంతేకాకుండా సూర్య కిరణాలు, సరైన ఆహారం, జీవనశైలి, కండరాల బలహీనత చర్మాన్ని వదులుగా మారుస్తాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు పడటం ప్రారంభమవుతుంది.




