- Telugu News Photo Gallery Skin Care Tips: Follow These Tips for Healthy and Beauty Skin Routine in Morning Time
Morning Skin Care: ఉదయాన్నే నిద్రలేచి ఈ పనులు చేయండి.. మీ చర్మం జిగేల్‌మని మెరుస్తుంది..
Skin Care Tips: లైఫ్ స్టైల్‌లో చర్మ సంరక్షణ అనేది చాలా కీలకం. శరీరంలోని అవయవాలను ఏ విధంగా చూసుకుంటామో.. చర్మాన్ని కూడా అదే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, కొందరు బిజీ లైఫ్ కారణంగా చర్మ సంరక్షణపై అంతగా శ్రద్ధ చూపరు. అయితే, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ చిన్న పనులు చేస్తే చాలు మీ ముఖ చర్మం దగదగలాడటం ఖాయం అని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Aug 15, 2023 | 9:02 PM

మచ్చలు లేని, మృదువైన చర్మాన్ని పొందాలొంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, ఉదయాన్నే లేచి ఈ చిన్న చిన్న పనులు చేస్తే అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అవును, రోజంతా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకున్నా.. ఉదయాన్నే చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ద వహించాల్సి ఉంటుంది. అంటే నిద్రలేవగానే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి రోజు ఉదయం లేచిన తరువాత ఫ్రెషప్ అయి.. ముందుగా ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఇది పేగులను, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఫలితంగా చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చర్మం తేమగా ఉంటుంది.

నీళ్లు తాగిన తరువాత కాసేపటికి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తేలికపాటి ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మంలో పేరుకుపోయిన మురికి మొత్తం తొలగిపోతుంది.

ఉదయం సమంయలో ముఖం కడుక్కున్న తరువాత టోనర్‌ని అప్లై చేయాలి. ఈ టోనర్లు చర్మం pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి. కాటన్ బాల్ సహాయంతో టోనర్‌ను అప్లై చేయాలి.

టోనర్ తరువాత ఫేస్ సీరమ్‌ను ఉపయోగించాలి. చిన్న మొత్తంలో సీరమ్ తీసుకుని, ఆ చుక్కలను చర్మానికి అప్లై చేయాలి. ఆ తరువాత తప్పనిసరిగా సన్ స్క్రీన్‌ను అప్లై చేయాలి. సన్ స్క్రీన్ మన చర్మాన్ని హానీకరమైన UV కిరణాల నుంచి రక్షిస్తుంది.

ఉదయం సమయంలో వ్యాయామం చేయాలి. ఇది శరీరంలోని అన్ని హానీకరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. తద్వారా చర్మం ప్రకాశాన్ని పెంచుతుంది. చర్మం కాంతివంతంగా, అందంగా ఉంటుంది.