- Telugu News Photo Gallery Skin Care Tips Follow these beauty tips for sensitive skin Beauty tips in telugu
Beauty Tips: సున్నితమైన చర్మం, నిగారింపు కోసం ఈ టిప్స్ పాటించండి చాలు.. అవేంటో తెలుసుకోండి..
Beauty tips in telugu: ప్రతీ సీజన్‌లో చర్మాన్ని సంరక్షించుకోవడానికి మీరు కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. ఈ చిట్కాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందాన్ని మెరుగుపర్చేందుకు సహాయపడతాయి.
Updated on: Jun 14, 2022 | 9:55 PM

వేసవితోపాటు పలు సీజన్లలో చర్మానికి చాలా జాగ్రత్తలు అవసరం. హానికరమైన UV కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు ఎలాంటి చిట్కాలను అనుసరించవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మర్చిపోవద్దు - ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం చాలా మంచిది. ఇది సూర్యుని హానికరమైన UV కిరణాల నుంచి రక్షిస్తుంది. సన్‌స్క్రీన్‌ను ముఖానికి మాత్రమే కాకుండా మెడ, చేతులు, పాదాలకు కూడా అప్లై చేయాలి.

క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయండి: వేసవిలో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. రంధ్రాలను క్లియర్ చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పనిచేస్తుంది. మీరు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి ఇంట్లో తయారుచేసిన స్క్రబ్‌ను కూడా ఉపయోగించవచ్చు.

చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచండి: వేసవిలో మన శరీరం చెమట కారణంగా నీటిని కోల్పోతుంది. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీని వల్ల చర్మం కూడా పొడిబారుతుంది. అటువంటి పరిస్థితిలో వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచడానికి క్రమం తప్పకుండా తగినంత నీరు తాగాలి.

ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించండి: ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్‌లు చర్మానికి మేలు చేస్తాయి. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. టాన్ ను కూడా తొలగిస్తాయి. నిమ్మ, పెరుగు, పాలు, శెనగపిండి, టొమాటో వంటి వాటిని ఉపయోగించి మీరు ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ చిట్కాలు మంచిగా పనిచేస్తాయి.




