- Telugu News Photo Gallery 'Running vs skipping' Any of these can lead to fast weight loss, check here is details in Telugu
Running vs Skipping: ‘రన్నింగ్ వర్సెస్ స్కిప్పింగ్’.. వీటిల్లో ఏదిచేస్తే ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వొచ్చు!
ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, చేస్తున్న ఉద్యోగాల కారణంగా బరువు పెరిగి పోతున్నారు. అందులోనూ డెస్క్ జాబ్స్ చేసేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. గంటలకు గంటలు కదలకుండా కూర్చోని చేస్తూంటారు. ఇలాంటి వారు ప్రతి రోజూ ఎక్సర్ సైజ్ లు లేదా వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి. అంతే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. అయితే మరికొంత మంది రన్నింగ్, స్కిప్పింగ్ కూడా..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 25, 2023 | 10:06 PM

ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, చేస్తున్న ఉద్యోగాల కారణంగా బరువు పెరిగి పోతున్నారు. అందులోనూ డెస్క్ జాబ్స్ చేసేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. గంటలకు గంటలు కదలకుండా కూర్చోని చేస్తూంటారు. ఇలాంటి వారు ప్రతి రోజూ ఎక్సర్ సైజ్ లు లేదా వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి. అంతే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి.

అయితే మరికొంత మంది రన్నింగ్, స్కిప్పింగ్ కూడా చేస్తూంటారు. ఇవి రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని చేయడం వల్ల త్వరగా బరువు తగ్గడమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి రెండూ మంచివే అయినా.. ఈ రెండింట్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి.

స్కిప్పింగ్, రన్నింగ్ ఈ రెండూ కూడా కండరాలను బలంగా, దృఢంగా చేస్తాయి. క్యాలరీలను కూడా ఎక్కువగా ఖర్చు చేస్తాయి. అయితే రన్నింగ్ తో పోల్చితే స్కిప్పింగ్ చేయడం కష్టం. దీనికి అధిక శ్రమ అవసరం. కానీ ఈ రెండింట్లో స్కిప్పింగ్ చేస్తేనే త్వరగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఇతర ఎక్సర్ సైజ్ లు, వాకింగ్, రన్నింగ్ కంటే.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేస్తే.. పది రోజుల్లోనే తేడా గమనిస్తారు. అలాగే డైట్ మెయిన్ టైన్ చేస్తే.. ఖచ్చితంగా రిజల్ట్ తక్కువ రోజుల్లోనే కనిపిస్తుంది. ప్రతి రోజూ స్కిప్పింగ్ చేస్తే వీపు కండరాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి.

కానీ రన్నింగ్ చేయడం వల్ల గుండె కండరాలు బలంగా తయారవుతాయి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. రన్నింగ్ చేస్తే.. శరీరంలో ఎండార్పిన్, సెరటోనిన్ అనే సంతోషకరమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీని వల్ల మానిసిక ఒత్తిడి, డిప్రెషన్ కూడా దూరం అవుతాయి. ఊపిరి తిత్తుల్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ కూడా బయటకు వెళ్తుంది. కాబట్టి మీ శరరీ తత్త్వాన్ని బట్టి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది.





























