AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: కివీస్‌తో వన్డే సిరీస్‌.. రోహిత్ ముందు 5 భారీ మైలురాళ్లు.. ఆ క్లబ్‌లో తొలి బ్యాటర్‌గా రికార్డ్..?

Rohit Sharma Milestones: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ ముందు పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. తొలి వన్డే బుధవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. 21 వేల అంతర్జాతీయ పరుగులు, వన్డేల్లో 400 సిక్సర్లు వంటి ఘనతలకు హిట్‌మ్యాన్ చేరువలో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో సిరీస్‌లో అద్భుత ఫామ్ చూపించిన రోహిత్, కివీస్‌పైనా చెలరేగాలని చూస్తున్నాడు.

Venkata Chari
|

Updated on: Nov 03, 2026 | 12:12 PM

Share
Rohit Sharma Milestones: ఐదు మ్యాచ్‌ల హై-ఓల్టేజ్ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో రోహిత్ 14 మ్యాచ్‌లు (13 ఇన్నింగ్స్) ఆడి 437 పరుగులు చేశాడు. సగటు 36.41, ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో అతడు అందుకోగల 5 భారీ మైలురాళ్లు ఇవే.

1 / 8
1. 21,000 అంతర్జాతీయ పరుగులు:  రోహిత్ 21 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయికి కేవలం 348 పరుగుల దూరంలో ఉన్నాడు. 517 అంతర్జాతీయ మ్యాచ్‌లు (550 ఇన్నింగ్స్) ఆడిన అతడు 42.66 సగటుతో 20,652 పరుగులు చేశాడు. ఇందులో 52 సెంచరీలు, 113 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 264.

2 / 8
2. సెనా దేశాలన్నింటిలో వన్డే శతకాలు చేసిన నాలుగో భారత బ్యాటర్: న్యూజిలాండ్‌లో ఒక్క శతకం కొడితే చాలు. అప్పుడు సెనా (SENA) దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అన్నింటిలోనూ వన్డే సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు.

3 / 8
3. సెనా పరిస్థితుల్లో 5,000 పరుగులు చేసిన తొలి భారత ఓపెనర్: రోహిత్ మరో 36 పరుగులు చేస్తే సెనా దేశాల్లో 5,000 అంతర్జాతీయ పరుగులు పూర్తిచేసిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ దేశాల్లో 114 మ్యాచ్‌లు (123 ఇన్నింగ్స్) ఆడి 44.32 సగటుతో 4,964 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 171*.

4 / 8
4. గెలుపు మ్యాచ్‌ల్లో 15,000 పరుగులు చేసిన నాలుగో బ్యాటర్: రోహిత్ పరుగులు చేస్తే జట్టు గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. విజయాల్లో అతడు 327 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో (340 ఇన్నింగ్స్) 51.62 సగటుతో 14,817 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరో 183 పరుగులు చేస్తే, గెలుపు మ్యాచ్‌ల్లో 15 వేల పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ క్లబ్‌లో ఇప్పటికే ఉన్నవారు: రికీ పాంటింగ్: 377 మ్యాచ్‌ల్లో 20,140 పరుగులు (55 సెంచరీలు), విరాట్ కోహ్లీ: 338 మ్యాచ్‌ల్లో 18,589 పరుగులు (60 సెంచరీలు), సచిన్ టెండూల్కర్: 307 మ్యాచ్‌ల్లో 17,113 పరుగులు (53 సెంచరీలు)లతో నిలిచారు.

5 / 8
5. వన్డేల్లో 400 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ రోహితే. అతడి ఖాతాలో 381 సిక్సర్లు ఉన్నాయి. 400 సిక్సర్ల మార్కు చేరడానికి మరో 19 సిక్సర్లు కావాలి. వీటికి మరో 7 సిక్సర్లు కలిపితే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 సిక్సర్లు పూర్తవుతాయి.

6 / 8
వరల్డ్ కప్ ముందు స్ట్రాంగ్ ఫామ్: 2027 వరల్డ్ కప్‌నకు ముందు రోహిత్ స్థానం, ఫామ్‌పై చర్చ జరుగుతున్నా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో మూడో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. 291 వన్డేల్లో (283 ఇన్నింగ్స్) 49.26 సగటుతో 12,120 పరుగులు చేశాడు. ఇందులో 35 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 264.

7 / 8
ఈ ఏడాది వన్డేల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 50.33 సగటు, 104.67 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 138. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో 75.00 సగటుతో 225 పరుగులు చేసి భారత్ తరఫున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్ట్రైక్ రేట్ 115 పైనే. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 101.

8 / 8
Follow Us