AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ridge Gourd: బీరకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అయితే ఈ సమస్యలున్నవారు మాత్రం తినొద్దు..

కురగాయాల్లో బీరకాయకు డిఫరెంట్ స్థానం. ఎక్కువగా జ్వరం వచ్చి తగ్గితే ఆ ఇంట్లో బీరకాయ కూర ఉండాల్సిందే. దీనిలో ఎక్కువ పోషకాలు, ఫైబర్, నీరు ఉండడంతో తొందరగా జీర్ణం అవుతుంది. కనుకనే జ్వరం నుంచి కోలుకున్న వారికీ బీరకాయ కూరతో భోజనం పెడతారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే బీర కాయను తరచుగా తినే ఆహారంలో భాగంగా చేర్చుకోమని చెబుతారు నిపుణులు. అయితే దీనిని కొన్ని శారీరక సమస్యలున్నవారు తినకుండా ఉండడం మంచిది అని హెచ్చరిస్తున్నారు. ఔషధాల గని అయిన బీర కాయలో విటమిన్లు, మినరల్స్ సహా వివిధ పోషకాలు ఉన్నాయి. కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ అన్ని కూరగాయలను తినకూడదు. అదే విధంగా కొంతమంది బీరకాయను తినొద్దు. ఈ రోజు ఎవరు ఈ కూరగాయలను తినకూడదో తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Jun 26, 2024 | 11:38 AM

Share
శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచుగా నీళ్లు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, గుమ్మడి కాయ వంటి వాటిని తినడం ఆరోగ్యానికి మంచివి. వాటిలో విటమిన్లు, మినరల్స్ సహా వివిధ పోషకాలు ఉన్నాయి. ఫలితంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ కూరగాయలను తినాలి

1 / 5
విటమిన్ ఎ, బి, సి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కనుక ఇది కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2 / 5
కొంత మందికి అలెర్జీ సమస్యలు ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు బీరకయను తినడం మంచిదో కాదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చర్మంపై దురద, దద్దుర్లు వంటి స్కిన్ సంబంధిత ఇబ్బంది ఉంటే బీరకాయకు దూరంగా ఉండడం మేలు. ఎందుకంటే కొంతమందికి ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.

3 / 5
గర్భధారణ సమయంలో పండ్లు, కూరగాయలు తినడం మంచిది. అయితే.. ఈ సమయంలో ఏదైనా అతిగా తినడం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భధారణ సమయంలో బీరకాయను ఎక్కువగా తినకూడదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు

4 / 5
కడుపుని శుభ్రపరచడానికి ప్రయోజనకరమైన బీరకాయను.. విరేచనాలతో బాధపడేవారు తినోద్దు. బీరకాయని డయేరియా పేషెంట్స్ తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తీవ్రమవుతాయి

5 / 5