- Telugu News Photo Gallery Relationship Tips why you have distance with love partner dont do these mistakes
Relationship Tips: రిలేషన్‌షిప్‌లో ఈ ఐదు తప్పులు చేస్తే మీ కొంప కొల్లేరే.. పార్టనర్‌తో జాగ్రత్త సుమా..
విడదీయరాని బంధం వివాహబంధం.. జీవితంలో వివాహబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషుల మధ్య సంబంధం మరింత సున్నితంగా మారింది. ప్రియుడు లేదా ప్రియురాలు కావచ్చు.. చిన్న చిన్న విషయాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వాటిని పట్టించుకోకపోతే బంధంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
Updated on: Apr 01, 2023 | 1:33 PM

విడదీయరాని బంధం వివాహబంధం.. జీవితంలో వివాహబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషుల మధ్య సంబంధం మరింత సున్నితంగా మారింది. ప్రియుడు లేదా ప్రియురాలు కావచ్చు.. చిన్న చిన్న విషయాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వాటిని పట్టించుకోకపోతే బంధంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు రిలేషన్‌షిప్‌లో ఇద్దరి బంధాన్ని సమతూల్యం చేసుకునేలా ఉండాలి. లేకపోతే ఇద్దరూ ఎక్కువ కాలంపాటు బంధంలో కొనసాగడం కష్టం. ప్రేమ.. భాగస్వామి మధ్య దూరం ఏర్పరిచే ఆ 5 తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Love

తరచుగా మీరు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ‘ఎస్’ అని చెబుతారు. లేదా మీరు తప్పుల గురించి వారిని ఒప్పించలేరు.. ఈ సమయంలో ఇది గుర్తుంచుకోండి.. బంధంలో 'ఎస్'తో పాటు 'నో' కూడా సమానంగా ముఖ్యమైనది. మీరు మీ నిర్ణయానికి అనుగుణంగా తిరస్కరించవచ్చు. ఇది జరగకపోతే ఇంకా దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోండి.

మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్నిసార్లు బిజీ పని లేదా మరేదైనా కారణాల వల్ల, మీరు ఎల్లప్పుడూ కలవలేరు లేదా మాట్లాడుకోలేరు. కావున విచారంగా ఉండకండి. మీలో మీరు సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఎప్పుడూ దురాలోచన, విచారంగా ఉండడం లాంటి వాటిని వదిలేయండి.

మీ భాగస్వామితో కలిసి ఉన్నప్పుడు.. మరొకరిని అతిగా పొగిడితే, జీవిత భాగస్వామి హృదయంలో ఎక్కడో అపార్థాలు తలెత్తుతాయి. అది విడిపోవడానికి కారణం కావచ్చు. కావున జాగ్రత్త పడండి..

భాగస్వామి మీకు అవసరమైన ఏదైనా పని చేస్తుంటే, సహకరించడానికి ఎప్పటికీ వెనకడుగు వేయకండి.. ఒకరు కష్టపడి పని చేస్తుంటే, మరొకరు విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తుంటే.. కలిసి ఉన్నప్పటికీ ఒంటరితనం అనుభూతి చెందుతుంది. కావున ఇలాంటి వాటిని దూరం పెట్టండి.. ఒకరినొకరు సాయం చేసుకుంటూ అన్యోన్యంగా గడపండి..




