AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: బంధాన్ని తెగదెంపులు చేసే అత్యంత హానికరమైన ఆరు విషయాలివే.. భార్యాభర్తలూ బీకేర్‌ఫుల్..

ఉరుకులు పరుగుల జీవితం.. ఎన్నో సమస్యలు.. మరెన్నో సవాళ్లు.. ఇలాంటి జీవితంలో చాలామంది కుటుంబాన్ని విస్మరిస్తూ.. బంధాలను తెగదెంపులు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే అనేక విషయాలు ఉన్నాయి. వీటిద్వారా ఆరోగ్యకరమైన సంబంధం క్షీణించే అవకాశం ఉంది.

Shaik Madar Saheb
|

Updated on: May 11, 2023 | 2:34 PM

Share
ఉరుకులు పరుగుల జీవితం.. ఎన్నో సమస్యలు.. మరెన్నో సవాళ్లు.. ఇలాంటి జీవితంలో చాలామంది కుటుంబాన్ని విస్మరిస్తూ.. బంధాలను తెగదెంపులు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే అనేక విషయాలు ఉన్నాయి. వీటిద్వారా ఆరోగ్యకరమైన సంబంధం క్షీణించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన సంబంధానికి అడ్డంకిగా మారె కొన్ని అంశాలను చెప్పబోతున్నాం.. అవేంటో తప్పని సరిగా తెలుసుకోండి..

1 / 7
కమ్యూనికేషన్ సమస్యలు: ఏదైనా సంబంధానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశాలలో కమ్యూనికేషన్ ఒకటి. ఒకరితో ఒకరు సాన్నిహిత్యంగా ఉండటం.. ఇష్టాఇష్టాలను పంచుకోవడం.. ఒకరినొకరు గౌరవంగా ఉండటం ముఖ్యం.. స్పష్టమైన సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేకపోతే.. అపార్థాలు తలెత్తవచ్చు, విభేదాలు రావచ్చు.. నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు.

2 / 7
నమ్మకం: ఏదైనా ఆరోగ్యకరమైన బంధానికి నమ్మకం పునాది. రిలేషన్‌షిప్‌లో ఉన్న భాగస్వాములకు (భార్యా భర్త) ముఖ్యంగా విశ్వసనీయత, నమ్మకం లేకపోతే బలమైన, ఆరోగ్యకరమైన బంధాన్ని ఏర్పరచుకోవడం కష్టం.

3 / 7
భిన్నమైన విలువలు లేదా లక్ష్యాలుః ఇద్దరు వ్యక్తులు జీవితంలో ప్రాథమికంగా భిన్నమైన విలువలు లేదా లక్ష్యాలను కలిగి ఉంటే.. ఆ ఇద్దరు భాగస్వాములను సంతృప్తిపరిచే విధంగా ఆరోగ్యకరమైన సంబంధాన్ని నిర్మించడం కష్టం అవుతుంది. అందుకే కొన్ని విషయాల్లో ఎవరో ఒకరు తగ్గడం మంచిది..

4 / 7
భావోద్వేగ సాన్నిహిత్యంః భావోద్వేగ సాన్నిహిత్యం అనేది భాగస్వాములు ఒకరికొకరు అనుభూతి చెందే సాన్నిహిత్యం.. అనుబంధం. భావోద్వేగ సాన్నిహిత్యం లేకుండా సంబంధం ఎక్కువకాలం, సంతృప్తికరంగా ఉండదు.

5 / 7
ఆర్థిక సమస్యలుః ఆర్థిక సమస్యలు రిలేషన్‌షిప్‌లో చాలా ఒత్తిడి, టెన్షన్‌కు కారణమవుతాయి. డబ్బు గురించి ఆలూమగలు మధ్య తలెత్తే అభిప్రాయభేదాలు వాదనలకు దారితీయవచ్చు. దీనిద్వారా ఇద్దరిలో ఒక విధమైన నిర్లక్ష్యం భావన వచ్చే అవకాశం ఉంటుంది.

6 / 7
అవిశ్వాసంః అవిశ్వాసం అనేది సంబంధానికి ఎప్పుడూ తూట్లు పొడిచేలా చేస్తుంది. నమ్మకం, ప్రేమ లేని చోట అనుమానం, అవిశ్వాసం లాంటివి కనిపిస్తాయి. ఒక జంట సమస్యను పరిష్కరించగలిగినప్పటికీ, నమ్మకాన్ని పునరుద్ధరించడానికి, సాన్నిహిత్యాన్ని తిరిగి పొందడానికి చాలా సమయం పడుతుంది.

7 / 7