- Telugu News Photo Gallery Reduce sweat odor with these natural tips, check here is details in Telugu
Remedies for Sweating: చెమట దుర్వాసనతో చిరాకు వస్తోందా.. ఇలా చేయండి..
సమ్మర్ వచ్చేసింది.. భానుడు తన ప్రతాపం చూపించడానికి సిద్ధమయ్యాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. సమ్మర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఉక్కపోత. ఈ ఉక్కపోత కారణంగా చెమట అనేది ఎక్కువగా పడుతుంది. పది నిమిషాలు బయటకు వెళ్తే చెమటతో తడిచిపోయి ఇంటికి వస్తారు. అయితే ఈ చెమట కారణంగా బాడీ నుంచి చెడు వాసన అనేది వస్తుంది. దీంతో మనకే కాకుండా పక్క ఉన్నవారికి ఇబ్బందిగా..
Updated on: Mar 18, 2024 | 6:17 PM

సమ్మర్ వచ్చేసింది.. భానుడు తన ప్రతాపం చూపించడానికి సిద్ధమయ్యాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. సమ్మర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఉక్కపోత. ఈ ఉక్కపోత కారణంగా చెమట అనేది ఎక్కువగా పడుతుంది. పది నిమిషాలు బయటకు వెళ్తే చెమటతో తడిచిపోయి ఇంటికి వస్తారు.

అయితే ఈ చెమట కారణంగా బాడీ నుంచి చెడు వాసన అనేది వస్తుంది. దీంతో మనకే కాకుండా పక్క ఉన్నవారికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ దుర్వాసన రాకుండా ఉండేందుకు చాలా మంది బాడీ స్ప్రే వంటివి ఉపయోగిస్తారు. అలాంటివి కాకుండా ఇంట్లోనే నేచురల్‌గా ఈ దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు.

మీరు స్నానం చేసే ముందు నీటిలో టీట్రీ ఆయిల్‌ని కొద్దిగా వేసి బాగా కలపండి. ఈ నీటితో స్నానం చేస్తే శరీర దుర్వాసన దూరం అవుతుంది. లేదంటే చిన్న గిన్నెలోకి నీటిని, టీట్రీ ఆయిల్ వేసి.. చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాల్లో అప్లై చేయాలి.

స్నానం చేసే ముందు నీటిలో తాజా టమాటా లేదా నిమ్మ కాయ రసాన్ని కూడా పిండుకోవచ్చు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే చెమ దుర్వాసన కూడా దూరం అవుతుంది. అంతే కాకుండా బ్యాక్టీరియా, వైరస్‌లు కూడా దరి చేరవు.

అదే విధంగా అందరి ఇళ్లల్లో వంట సోడా లభ్యమవుతుంది. వంట సోడాతో కూడా చెమట దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. ఓ కప్పు నీటిలో కొద్దిగా వంట సోడా కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి.. అండర్ ఆర్మ్స్ ప్రాంతంలో స్ప్రే చేస్తే సరి. ఇంకా మరిన్ని హోమ్ రెమిడీస్‌ని మీ ముందుకు తీసుకొస్తాం.




