- Telugu News Photo Gallery Cinema photos Ram Charan's Game Changer Movie Story Goes Viral In Social media Telugu Heroes Photos
Ram Charan – Game Changer: వెన్నుపోటు రాజకీయాలపై రామ్ చరణ్ ఫోకస్.! మేటర్ ఇదే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా పొలిటికల్ హడావిడి కనిపిస్తున్ననేపథ్యంలో గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ట్రిపులార్ సినిమా సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను ప్రారంభించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
Updated on: Mar 18, 2024 | 7:22 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా రేంజ్‌లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొదిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. అయితే షూటింగ్ ఆలస్యమైనా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

తాజాగా గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ ఒకటి రివీల్ అయ్యింది. ఈ సినిమా వెన్నుపోటు రాజకీయం నేపథ్యంలో రూపొందుతుందన్న టాక్ వినిపిస్తోంది. తన తండ్రి పార్టీని కొందరు వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకోవటం, ఆ తరువాత వాళ్ల దుర్మార్గ రాజకీయాల నుంచి ప్రజలను కాపాడేందుకు రాం నందన్ పాత్రలో రామ్ చరణ్ ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ.

రీసెంట్‌గా వైజాగ్ బీచ్‌లో జరిగిన షూటింగ్‌లోనూ పొలిటికల్ సీన్సే చిత్రీకరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పీక్స్‌లో ఉంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన సినిమా కోసం ఎంచుకున్న కథ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

అంతేకాదు ఈ కథ పూర్తిగా ఫిక్షనలా.. లేక ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ఇన్సిపిరేషన్‌తో తయారు చేశారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. శంకర్ సినిమాలో సామాజిక అంశాలు ఆడియన్స్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి.

అందుకే గేమ్ చేంజర్‌లో చూపించబోయే వెన్నుపోటు రాజకీయం కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.




