- Telugu News Photo Gallery Rajma chawal recipe: How To Make Punjabi Style Rajma chawal recipe At Home
Rajma Chawal Recipe: రాజ్మా చావల్ కర్రీ.. ఇలా చేశారంటే లొట్టలేసుకు తింటారు!
చేపలు, మాంసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అలా అని వీటిని రోజూ తినడం సరికాదు. ఫలితంగా పొట్టలో వేడి చేస్తుంది. జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తుతాయి. చేపలు, మాంసం ఎక్కువగా తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్యలు తలెత్తుతాయి. చేపల మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో త్వరగా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి స్పైసీ ఫుడ్ తినకుండా ఈ కాలంలో శాకాహారం తినడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
Srilakshmi C | Edited By: Janardhan Veluru
Updated on: Feb 04, 2024 | 9:49 PM

చేపలు, మాంసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అలా అని వీటిని రోజూ తినడం సరికాదు. ఫలితంగా పొట్టలో వేడి చేస్తుంది. జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తుతాయి. చేపలు, మాంసం ఎక్కువగా తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్యలు తలెత్తుతాయి.

చేపల మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో త్వరగా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి స్పైసీ ఫుడ్ తినకుండా ఈ కాలంలో శాకాహారం తినడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శాఖాహారులకు రాజ్మా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో తగినంత ప్రోటీన్ ఉంటుంది. శాకాహారులు నోటికి రుచిగా ఇంట్లో సులభంగా రాజ్మా చాల్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే..

రాజ్మా 1 కప్పు, దాల్చిన చెక్క పెద్దది 1, ఏలకులు పెద్దవి 2, బే ఆకులు 2, 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1 మీడియం ఉల్లిపాయ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమోటాలు, ఉప్పు తగినంత, పసుపు, కారం, కాశ్మీరీ కారం పొడి 1 స్పూన్, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ కసౌరి మేతి, కొన్ని కొత్తిమీర ఆకులు.

రాజ్మాను 5-6 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. వంట సమయంలో వాటిని శుభ్రంగా కడగాలి. రాజ్మా, దాల్చినచెక్క, యాలకులు, బే ఆకులను కుక్కర్‌లో వేఇ 4-5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర వేసి మరిగించాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్టును జోడించాలి. అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, కాశ్మీరీ కారం, కసౌరీ మేతి వేసి వేయించాలి. టమోటా మొత్తని పేస్ట్‌లా చేసుకుని, అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దానిని కూడా బాణలిలో వేసుకుని బాగా కలుపుకోవాలి.

నూనె వదలడం ప్రారంభించినప్పుడు, ఉడికించిన రాజ్మా అందులో వేసుకోవాలి. కొద్దిగా వేడి చేసిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర చల్లుకోవాలి. ఈ రాజ్మా చాల్.. వైట్ రైస్ లేదా జీలకర్ర అన్నంతో చాలా బాగుంటుంది.





























