- Telugu News Photo Gallery Technology photos Realme announces huge discounts on Realme narzo 60x 5g smart phone, Check here for full details
Realme Narzo 60X 5G: రియల్‌మీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ. 10 వేలకే 5జీ ఫోన్..
వినియోగదారులను ఆకర్షించే క్రమంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు దూకుడుమీదున్నాయి. భారీ ఆఫర్లను డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తూ మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజాగా రియల్ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు చూద్దాం..
Updated on: Feb 04, 2024 | 9:46 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ గతేడాది నార్జో 60ఎక్స్ పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తక్కువ ధరలో 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.

4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ వేరియంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే రియల్‌మీ నార్జో 60 ఎక్స్ రూ. 14,999గా ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 12,225కే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఆఫర్స్ ఇక్కడితోనే ఆగలేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే పలు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. వన్‌కార్డ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించి 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

దీంతో పాటు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా అన్ని రకాల డిస్కౌంట్స్ వర్తిస్తే ఈ ఫోన్‌ను కేవలం అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం రూ.10,725కే ఈ స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోచవ్చు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.6 ఇంచెస్‌తో కూడి హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్షన్ 810 ప్రాసెసర్‌పై పనిచేస్తేంది. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 50 ఎంపీ రెయిర్ కెమెరాను ఇందులో అందించారు.




