Best Laptop’s: అమెజాన్‌లో ఆ ల్యాప్‌టాప్స్‌పై అదిరే డిస్కౌంట్లు.. ఏకంగా 40 శాతం వరకూ ప్రత్యేక తగ్గింపులు

ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ పెరిగిన తర్వాత ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగికి ఇంటి వద్ద ల్యాప్‌టాప్‌ తప్పనిసరైంది. అలాగే విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు ప్రాజెక్ట్‌ వర్క్స్‌ కోసం ల్యాప్‌టాప్స్‌ కావాల్సి వస్తోంది. అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేశాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్స్‌ అయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సైట్ల ద్వారా ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా అమెజాన్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని రకాల ల్యాప్‌టాప్స్‌పై ఏకంగా 40 శాతం వరకూ తగ్గింపును అందిస్తుంది. కాబట్టి అమెజాన్‌ సేల్‌లో అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్స్‌ గురించి ఓ సారి తెలుసుకుందాం.

Srinu

|

Updated on: Feb 04, 2024 | 5:45 PM

ఏసర్‌ అస్పైర్‌ 5 గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ప్రస్తుతం 40 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల స్క్రీన్, 512 జీబీ హార్డ్ డ్రైవ్,16 జీబీ ర్యామ్‌తో పని చేస్తుంది. విండోస్‌ 11 ఆధారంగా పని చేసే ఈ ల్యాప్‌టాప్‌పై అనేక ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.57, 900గా ఉంది.

1 / 5
ఎంఎస్‌ఐ మోడల్‌ 14 ల్యాప్‌టాప్‌ 30 శాతం తగ్గింపుతో లభిస్తుంది. క్లాసిక్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉండే ఈ ల్యాప్‌ 36 సెంటీమీటర్ స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంది. అలాగే ఐ 7 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌ 16 జీబీ ర్యామ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా గేమర్ల కోసం ఈ ల్యాప్‌టాప్‌ అనువుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.54,990గా ఉంది.

2 / 5
ఏసస్‌ వివో బుక్‌ 16 ఎక్స్‌పై అమెజాన్‌లో ప్రస్తుతం 34 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ 40.64 సెంటీమీటర్ల స్క్రీన్ పరిమాణంతో పాటు 16 జీబీ+ 512 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. విండోస్‌ 11 హోమ్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌లో అదనపు భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ స్క్రీన్ యాంటీ గ్లేర్ కోటింగ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.57,390గా ఉంటుంది.

3 / 5
డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల స్క్రీన్‌తో సిల్వర్ కలర్ ఫినిషింగ్‌తో వస్తుంది. 512 జీబీ హార్డ్ డిస్క్, 16 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ ఐ5 ఆధారంగా పని చేస్తుంది. విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే  ఈ ల్యాప్‌టాప్ అదనపు భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో వస్తుంది. తక్కువ-కాంతి పరిస్థితుల్లో టైప్ చేయడానికి బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో పాటు ఈ డెల్‌ ల్యాప్‌టాప్‌ అమెజాన్‌ సేల్‌లో రూ.59,900కు సొంతం చేసుకోవచ్చు.

4 / 5
హెచ్‌పీ 15 ఎస్‌ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో 33 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. 39.6 సెంటీమీటర్ స్క్రీన్, నేచురల్‌ సిల్వర్‌ కలర్‌లో ఉండే ఈ ల్యాప్‌టాప్‌ 8 జీబీ +512 జీబీ వేరయింట్‌లో లభిస్తుంది. ఐ3 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ విండోస్‌ 11కు సపోర్ట్‌ చేస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లే, యాంటీ-గ్లేర్ టెక్నాలజీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సేల్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.38,990కు కొనుగోలు చేయవచ్చు.

5 / 5
Follow us