Maps: గూగుల్ మ్యాప్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఏఐ టెక్నాలజీతో..
గూగుల్ మ్యాప్స్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మ్యాప్స్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న కారణంతోనే గూగుల్ మ్యాప్స్‌కు క్రేజ్ తగ్గడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మ్యాప్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 03, 2024 | 10:00 PM

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మ్యాప్స్‌లోనూ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫీచర్‌తో ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యూజర్లు ఈ కొత్త ఫీచర్ సహాయంతో కొత్త ప్రదేశాలకు చెందిన అడ్రస్‌లకు సులభంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. మెదటగా ఈ ఏఐ ఫీచర్‌ను అమెరికాలో వినియోగదారులకు మ్యాప్స్‌లో జనరేటివ్ AI ఫీచర్లను అందించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ వారం ప్రారంభంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

ఈ ఫీచర్ సహాయంతో మ్యాప్స్‌లో కొత్త ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, రివ్యూలు, అక్కడి వెదర్‌కు సంబంధించిన వివరాలను ఏఐ కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

ఉదాహరణకు మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా వస్తువుకు సంబంధించిన అంశాన్ని ఎంటర్ చేయగానే మీకు దగ్గరల్లో ఆ వస్తువులు ఎక్కడ లభిస్తాయి.? వాటి ఫొటోలు, రేటింగ్‌లు, దగ్గరలోని ఇతర వ్యాపారాలు, స్థలాల గురించిన పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా చూపిస్తుంది.

అలాగే మీకు ఇష్టమైన ఆహారం కోసం టైప్ చేయగానే ఆ ఫుడ్ ఎక్కడ లభిస్తుంది. అక్కడికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది.? ఆ ఫుడ్ గురించిన పూర్తి సమాచారం, రేటింగ్ అన్నింటిని ఏఐ టెక్నాలజీ అందిస్తుంది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.




