- Telugu News Photo Gallery Technology photos Xiaomi launches new smartphone Xiaomi 14 features and price details
Xiaomi 14: షావోమీ కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. భారత మార్కెట్లోకి 14 సిరీస్..
షావోమీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. షావోమీ 14 సిరీస్‌ను త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనుంది. గతేడాది అక్టోబర్ నెలలో చైనా మార్కెట్లోకి లాంచ్ చేసిన షావోమీ 14 సిరీస్‌ను త్వరలోనే భారత్‌లో తీసుకురానున్నార. షావోమీ సిరీస్‌లో భాగంగా షావోమీ 14, షావోమీ 14 ప్రో ఫోన్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది..
Updated on: Feb 03, 2024 | 9:57 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లోకి షావోమీ 14 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ధర విషయానికొస్తే షావోమీ 14 ధర మన కరెన్సీలో సుమారు రూ. 50 వేలు, షామోవీ 14 ప్రో ధర సుమారు రూ. 56,500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్‌ను అందించనున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో లైకా ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు.

స్టోరేజ్ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారు. ఇక వారట్ రెసిస్టెంట్ కోసం ఇందులో ఐపీ68 రేటింగ్‌ను ఇవ్వనున్నారు. అలాగే ఇందులో 2కే రిజల్యూషన్‌తో కూడిన ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4610 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే 10 వాట్స్ వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌ను సైతం అందించారు.

షావోమీ 14 సిరీస్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో రెయిర్ కెమెరాను అందించనున్నార. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.




